Entertainment బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇప్పటికీ సంచలనంగానే మారింది ఈ విషయాన్ని అందరూ కొంచెం కొంచెంగా మర్చిపోతున్న సమయంలో మళ్లీ పెను దుమారం చల్లరేగింది ఇతనిది హత్య అని పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్ చెప్పడంతో ఈ విషయం మళ్ళీ తెరపైకి వచ్చింది..
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయిన దగ్గర నుంచి ఇతని మరణం పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి ఇదండీ కచ్చితంగా ఆత్మహత్య కాదని హత్య అంటూ ఇప్పటికే పలువురు ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా బాయికాట్ నెపోటిజంపై తమదైన శైలిలో వేరుశకుపడ్డారు అయితే ఏది ఏమైనా సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య అంటూ అప్పట్లో తేల్చి చెప్పేశారు అందరూ.. ఈ తరుణంలో కూపర్ హాస్పత్రి రిటైర్డ్ ఉద్యోగి రూప్ కుమార్ షా అతడిపై మరణంపై సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ విషయం మళ్ళీ తెరపైకి వచ్చింది ఇటీవలే సోషల్ మీడియా వేదికగా ఇతను సుశాంత్ సింగ్ కచ్చితంగా హత్య అని తేల్చి చెప్పేశారు..
అంతేకాకుండా సుశాంత్ శరీరంలో పలుచోట్ల ఎముకలు విరిగాయని తెలిపారు మెడపై కూడా గాయాలు ఉన్నట్టు చెప్పారు అంతేకాకుండా పిడుగులు గుద్దినట్టు కళ్ళ చుట్టూ తెలుస్తుందని మచ్చలు కూడా ఏర్పడ్డాయని తెలిపారు అయితే అతన్ని చూడగానే నేను ఇది కచ్చితంగా హత్య అని తేల్చి చెప్పేశాను అయినప్పటికీ అక్కడ ఉన్నవారు ఈ విషయాన్ని ఒప్పుకోలేదు తొందరగా పోస్టుమార్టం చేసి రిపోర్ట్ చేయండి పై అధికారులు ఒప్పుకోరు అంటూ కంగారు పెట్టారు అని చెప్పారు దీంతో మళ్లీ పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ విషయాన్ని సిబిఐకి అప్పగించాలని చెప్పకు వచ్చారు ఇందులో భాగంగానే బాలీవుడ్ నటుడు శేఖర్ సుమన్ ఈ కేసును సిబిఐ కి అప్పగించాలని ఇప్పటికైనా సుశాంత్ కు న్యాయం చేయాలని తెలిపారు..
.