Entertainment పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన చిత్రం లైకర్ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ కలిగించిందని చెప్పాలి అయితే ఈ సినిమాపై తాజాగా బాలీవుడ్ నటి మలోబికా బెనర్జీ స్పందించింది అంతేకాకుండా ఒక రకంగా విజయ్ పై తనదైన రీతిలో సెటైర్లు వేసుకొచ్చింది..
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ పై బాలీవుడ్ నటి మలోబికా బెనర్జీ తనదైన రీతిలో కామెంట్ చేసింది.. ఒకప్పుడు విజయ్ దేవరకొండ హిందీ భాషను వెటకారం చేశాడని అయితే ప్రస్తుతం అదే భాషలో సినిమాలు తీయడం నిజంగా విచిత్రంగా ఉందని చెప్పకు వచ్చింది.. తనతో ఐదేళ్ల క్రితం ఒక మ్యూజిక్ వీడియో చేశానని అయితే ఆ సమయంలో సెట్ లో విజయ్ ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడుతుండేవాడని చెప్పింది అంతేకాకుండా తనకి హిందీ అసలు అర్థం అయ్యేది కాదని హిందీలో ఎవరైనా మాట్లాడితే వెటకరించేవాడని అన్నది.. అయితే అలాంటి విజయ్ దేవరకొండ హిందీలో సినిమాలు చేయటం నిజంగా ఆశ్చర్యం కలిగించిందని అన్నది.. అలాగే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హిందీ మాట్లాడడం చూసి నిజంగా నవ్వొచ్చిందని వెటకారంగా కామెంట్లు చేసింది..
వీరిద్దరూ ‘నీ వెనకాలే నడిచి’ అనే మ్యూజిక్ వీడియోలో ఐదేళ్ల క్రితం నటించారు. అయితే మలోబిక బెనర్జీ లైగర్ మూవీ రిలీజ్‌కి ముందు లైగర్ ట్రైలర్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘వెల్‌కమ్ టు బాలీవుడ్ విజయ్’ అంటూ రాసుకొచ్చింది.