Entertainment బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ ఏడాది మంచి జోష్ మీద ఉన్నారు ఇప్పటికే ఈ ఒక్క ఏడాదే ఆరు సినిమాల్లో నటించిన ఈ హీరో వచ్చే ఏడాది షెడ్యూల్ కూడా మొదలు పెట్టేసారు అయితే ఈయన మొదటిసారి ఓ మరాఠీ చిత్రంలో నటిస్తున్నారు దీనికి సంబంధించిన చిత్రీకరణ ఈ రోజే మొదలైన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ అభిమానుల ఆశీర్వాదాలు కోరారు..
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ మహేష్ ముంజరేకర్ దర్శకత్వంలో నటిస్తున్న మరాఠీ చిత్రంలో అక్షయ్ చత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో కనిపించనున్నారు ఈరోజు ఈ సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభమైన సందర్భంగా అభిమానులు తమను తప్పకుండా ఆశీర్వదించాలని కోరారు..
అక్షయ్.. తొలిసారిగా మరాఠీ చిత్రంలో నటిస్తున్నారు. ఖురేషి ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.. ఈ మూవీకి వేదాత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్ టైటిల్ ను కూడా ఖరారు చేశారు. ఇందులో అక్షయ్ కుమార్ ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రను పోషిస్తున్నారు. ఈరోజు మూవీ ఫస్ట్ షెడ్యూల్‌ను ముంబైలో ప్రారంభించారు. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. “ఈ రోజు నేను మరాఠీ చిత్రం ‘వేదాత్ మరాఠే వీర్ దౌడలే సత్’ షూటింగ్‌ను ప్రారంభిస్తున్నాను. ఇందులో ఛత్రపతి శివాజీ మహారాజ్ జీ పాత్రను పోషించడం నా అదృష్టం. ఆయన జీవితం, తల్లి జిజావు ఆశీర్వాదంతో ప్రేరణ పొందాను. నా వంతు కృషి చేస్తాను.. అలాగే మీ ఆశీర్వాదం కూడా మాపై ఉండాలి” అని కోరారు.