Viral Video ఐక్యమత్యమే మహాబలం అన్నారు పెద్దలు చిన్నప్పటినుంచి వీటికి సంబంధించి ఎన్నో కథలు చదువుకుంటూనే వచ్చాము అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన ఈ విషయాన్ని మరొక సారి నిజమని నిరూపించింది..
నలుగురు కలిసి ఉంటే ఏ పనైనా చేయగలుగుతారు అదే వారి మధ్య వారి కలహాలు వస్తే ఆ విషయం శత్రువుకి బలం అవుతుంది ఈరోజుల్లో సమాజంలో ఇదే జరుగుతుంది తమలో తాము గొడవ పడుకొని ఎదుటివారికి చులకనగా మారుతున్నారు. మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా ఇదే ధోరణి జరుగుతుందని నిరూపించాయి కొన్ని సింహాలు.. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
కొన్ని సింహాలు ఒక గేదెను పట్టుకున్నాయి దాన్ని చుట్టుముట్టి ఎటూ కదలకుండా చేశాయి స్థితిలో ఉన్న గేదె ఏమీ చేయలేక అలానే ఉండిపోయింది అయితే ఇంతలో అక్కడ ఉన్న నాలుగు సింహాల మధ్య చిన్న కొట్లాట మొదలైంది రెండు సింహాలు మొదటగా ఒకదాన్ని ఒకటి గర్జించుకోవడం మొదలుపెట్టగా తర్వాత మూడో సింహం కూడా అందులో చేరింది చివరికి వాటితో అది గొడవలు ఆడుకుంటూ అసలు విషయాన్ని మరిచిపోయాయి ఇంకా ఏదైనా అలాగే వదిలేసి వేరే వైపు నడుచుకుంటూ వెళ్లిపోయాయి ఇదే అదనుగా భావించిన గేదె అక్కడి నుంచి గబగబా తప్పించుకుంటూ పారిపోయింది.. ఈ వీడియో చూసిన వారంతా నిజమే ఐకమత్యమే మహాబలం అంటూ కామెంట్లు పెడుతున్నారు..
https://twitter.com/OTerrifying/status/1582707125863665665?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1582707125863665665%7Ctwgr%5Edad6ca0bd5e1ef61c024cb4cdce462d241d35353%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Fviral-adda%2Fomg-news%2Fbuffalo-escaped-from-a-group-of-fighting-lions-watch-viral-video%2Farticleshow%2F95093668.cms