Unstoppable Show : నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. సినిమాలు, టాక్ షో తో ప్రేక్షకులను ఫుల్ గా అలరిస్తున్నారు బాలయ్య. ప్రముఖ ఓటిటి అయిన ఆహా వేదికగా… ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ షో కి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆద్యంతం ఆసక్తిగా ఉంటూ, ప్రేక్షకుల మన్ననలు పొందుతూ … అత్యధిక హిట్స్ తో దూసుకుపోతోంది ఈ షో.
ప్రస్తుతం అన్ స్టాపబుల్ టాక్ షో మొదటి సీజన్ పూర్తయ్యి… సీజన్ 2 కూడా ఆసక్తిగా కొనసాగుతుంది. రెండవ సీజన్ మొదటి ఎపిసోడ్ లో చంద్రబాబు నాయుడు గెస్ట్ గా విచ్చేశారు. మొదటి సీజన్లో మోహన్ బాబు, మహేశ్ బాబు, అల్లు అర్జున్, నాని, రవితేజ, రాజమౌళి, రానా వంటి సెలబ్రిటీలు పాల్గొన్నారు. రెండోవ సీజన్ మొదటి ఎపిసోడ్ తర్వాత యంగ్ హీరోలు అడవి శేష్, సిద్ధార్ద్, విశ్వక్ శర్వానంద్ లు వచ్చారు. కానీ సీనియర్ హీరోలు అయిన చిరు, వెంకటేశ్, నాగార్జున ఇంత వరకు ఈ షో పాల్గొనలేదు. దీంతో ఇప్పడు వచ్చే ఎపిసోడ్స్ లో గెస్ట్స్ ఎవరు రాబోతున్నారు అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.
ఇక ఇప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో పాటు మిగిలిన స్టార్ హీరోలు కూడా త్వరలోనే ఈ షో లో పాల్గొనబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చిరు, బాలయ్య ఎపిసోడ్ సంక్రాంతి పండుగకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అప్పుడు అయితేనే చిరు నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలయ్య చేస్తున్న వీర సింహ రెడ్డి సినిమాలకు ఒకేసారి ప్రమోషన్ లో హైప్ వస్తుందని అంటున్నారు. మరి చూడాలి వాళ్ళు ఎప్పుడు ఈ షో కి వస్తారో అని.