చెక్ రిపబ్లిక్ లోని ప్లెజెన్ లో జరిగిన 52వ గ్రాండ్ ప్రిక్స్ లిబరేషన్ ప్లెజెన్ 2024 క్రీడా పోటీల్లో రాచకొండ కమిషనరేట్లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ అల్లూరి ప్రసన్నకుమార్ బృందం కాంస్య పతకాన్ని సాధించడం జరిగింది. మే 1 నుండి ఐదో తేది వరకు జరిగిన పోటీల్లో పాయింట్ 32 ఫైర్ పిస్టల్ పురుషుల విభాగంలో అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చి కాంస్య పతకాన్ని అందుకున్న ప్రసన్న కుమార్ ను రాచకొండ కమిషనర్ శ్రీ తరుణ్ జోషి ఐపీఎస్ గారు ఈరోజు నేరెడ్ మెట్ లోని కార్యాలయంలో అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్