Daggubati Rana : దగ్గుబాటి రానా గురించి దేశవ్యాప్తంగా మంచి పేరు ఉంది. ఇక టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో రానా దగ్గుబాటి – మిహికా జోడీ ఒకటి. కాగా పెళ్లికి ముందు కొద్ది రోజుల పాటు రానా-మిహీకాలు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 8 2020న కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇక పెళ్ల తర్వాత కూడా ఈ లవ్లీ కపుల్ పండగలు, పర్వదినాల సందర్భాల్లో జంటగా కలిసున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా రానా ఫ్యామిలీకి సంబంధించి గత కొన్ని రోజులుగా ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. రానా భార్య మిహికా గర్భంతో ఉందన్న వార్తలు ప్రచురించాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించింది మిహికా. సోషల్ మీడియాలో బిజీగా ఉంటే మిహీకా తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను అందులో షేర్ చేస్తుంటుంది. అలాగే రానాతో దిగిన ఫొటోలు, వీడియోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. ఈనేపథ్యంలో తాజాగా మిహికా షేర్‌చేసిన ఫొటోల్లో ఆమె కాస్త బొద్దుగా కనిపించడంతో ప్రెగ్నెంట్ రూమర్స్ తెరపైకి వచ్చాయి.
తాజాగా ఇదే విషయంపై ఓ అభిమాని మిహికాను ‘మీరు ప్రెగ్నెంటా’? అని అడిగాడు. దీనికి ‘నేను ఇంకా హ్యాపీ మ్యారీడ్ లైఫ్‌లో ఉన్నాను. అందుకే ఈ మధ్య కాస్త హెల్దీగా మారాను’ అంటూ మిహికా సమాధానం ఇచ్చింది. దీంతో మిహికా ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వదంతులకు చెక్ పడినట్లయింది. రానా ప్రస్తుతం తన బాబాయి వెంకటేశ్‌తో కలిసి రానా నాయుడు అనే ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. తెలుగుతో పాటు హిందీలోనూ రూపొందుతున్న ఈ సిరీస్‌కు సంబంధించి త్వరలోనే అప్డేట్ రానుంది.