Entertainment సొట్ట బుగ్గల సుందరి దీపిక పదుకొనే ఈరోజు తన 37 వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది.. మోడల్గా కెరీర్ను మొదలుపెట్టి అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది ఈ హీరోయిన్ బాలీవుడ్ హాలీవుడ్ లో సైతం నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అయితే ఈరోజు సందర్భంగా ఆమె కోసం కొన్ని ఆసక్తికర విషయాలు ఏంటంటే..
దీపికా పదుకొనే అంటే అందం మాత్రమే కాదు ఆమె ఎదిగి వచ్చిన తీరు ఎందుకు ఆదర్శమని చెప్పాలి మోడల్గా కెరీర్ను మొదలుపెట్టిన ఈ భామ వరుసగా అవకాశాల్ని పుచ్చుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకుంది అలాగే బాలీవుడ్లో మొదటి సినిమానే స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తో చేసి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకు వెళ్ళింది అలాగే వ్యక్తిగత జీవితం పరంగా ఎన్నో అడ్డంకులు ఎదురైనప్పటికీ వాటిని తట్టుకొని నిలబడింది ఈ భామ.. జీవితంలో ఒకానొక పరిస్థితుల్లో డిప్రెషన్కు గురయ్యానని పలుమార్లు చెప్పుకొచ్చారు అయితే దాన్నుంచి బయటపడి ఇప్పటికి పలువురికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు..
డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో 1986 జనవరి 5న జన్మించారు దీపిక .. దీపిక తండ్రి ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకుణె. తల్లి ఉజ్వల ట్రావెల్ ఏజంట్. దీపిక చిన్నప్పుడు తండ్రి బాటలో నడిచి బ్యాడ్మింటన్ ఎంచుకుంది. రాష్ట్రస్థాయిలో క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది.. అలాగే హై స్కూల్లో చదువుతున్నప్పుడే పలు ప్రకటనల్లో నటించింది.. దీపికా పదుకొనే ఓ మనిషి రైటర్.. ఓ ఇంగ్లీష్ దినపత్రికకు 2009లో పలు వ్యాసాలు కూడా రాశారు..