Upasana : రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన పెళ్లయిన 11 ఏళ్ళ తరువాత తమ మొదటి బేబీకి ఆహ్వానం పలికిన సంగతి తెలిసిందే. జూన్ 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చి మెగా కుటుంబంతో పాటు మెగా అభిమానుల్లో కూడా ఎంతో ఆనందాన్ని నింపింది. ఇక ఆ పాపకి లలితా సహస్ర నామం నుంచి ‘క్లిం కార’ అనే ప్రధాని తీసుకోని పేరు పెట్టారు. మెగా అండ్ కామినేని వారి వారసురాలు అంటే ఒక రేంజ్ ఉంటుంది కదా. ఈ క్రమంలోనే ‘క్లిం కార’ని ప్రిన్సెస్ గా చూసుకుంటున్నారు. తన కోసం ఒక ప్రత్యేక డిజైనర్ ని పెట్టి ఒక రూమ్ ని డిజైన్ చేస్తున్నారు.
ముద్దుల వారసురాలు చుట్టూ ఆహ్లాదకర వాతావరణం ఉండేలా ఉపాసన పుట్టిల్లు అయిన కామినేని నివాసంలో ప్రత్యేక ఇంటీరియర్ తో ఒక రూమ్ ని సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ప్రముఖ ఆర్కిటెక్ట్ పవిత్రా రాజారామ్ ని రంగంలోకి దించారు. ఈ రూమ్ ని డిజైన్ చేయడానికి అమ్రాబాద్ ఫారెస్ట్ అండ్ వేదిక్ హీలింగ్ అంశాలను స్ఫూర్తిగా తీసుకున్నారు. కేవలం ఈ రూమ్ ని మాత్రమే కాదు, అపోలో ఆస్పత్రిలో ఉపాసన డెలివరీ రూమ్‌ని కూడా ఇలాగే డిజైన్ చేశారట. ఈ విషయాలన్నిటిని ఒక వీడియో ద్వారా ఉపాసన తెలియజేసింది.
ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్స్ మెగా ప్రిన్సెసా మజాకా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ మెగా ప్రిన్సెస్ తో మొన్నటి వరకు హ్యాపీగా టైం స్పెండ్ చేసిన రామ్ చరణ్ ఇప్పుడు మళ్ళీ షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చెంజర్ (Game Changer) సినిమాలో నటిస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ మొదటిసారి తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నారు.