Samantha Ruth Prabhu: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా తన అభిమానులకు, సినీ లవర్స్‌కు షాకింగ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటానని ఆమె చెప్పటం అభిమానులకు చాలా బాధ పెట్టింది. గత కొంత కాలంగా ఆమె మయోసైటిస్‌తో బాధపడుతుంది. ఆ మధ్య దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండటంతో సినిమాలకు దూరమైంది. అయితే తర్వాత ఆరోగ్యం కుదుటపడగానే విజయ్ దేవరకొంండ సినిమా ఖుషి సినిమాను పూర్తి చేసేసింది. ఇక సిటాడెల్‌ను పూర్తి చేసే పనిలో ఉంది. దీని తర్వాత ఏ సినిమాకు ఆమె ఓకే చెబుతుందోనని అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో ఏడాది పాటు బ్రేక్ తీసుకుంటున్నానని చెప్పి షాకిచ్చింది.
ఈ వీకెండ్ ముంబై ఎయిర్ పోర్టులో ఆమె కనిపించింది. అయితే ముఖానికి మాస్క్ వేసుకుని మీడియాను అవాయిడ్ చేసి వెళ్లిపోయింది. అసలు సమంత ముంబై ఎందుకు వచ్చింది.. షూటింగ్ కోసం వచ్చిందా..? ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండటం అంటే మామూలు విషయం కాదు.. అమెరికాకు ఏమైనా ట్రీట్‌మెంట్‌కు వెళుతుందా? అని ప్రశ్నలు అందరి మెదళ్లను తొలిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత పోస్ట్ చేసిన సెల్ఫీ పిక్ వైరల్ అయ్యింది.
ఆ సెల్ఫీని గమనిస్తే.. ఆమె చాలా బలహీనంగా ముఖం అంతా పీక్కువపోయి కనిపిస్తోంది. దీంతో పాటు ఈ ఆరు నెలలు చాలా కష్టతరంగా గడిచాయనే మెసేజ్‌ను కూడా ఆమె పోస్ట్ చేసింది. అసలు సమంతను అలా చూసిన నెటిజన్స్ షాకవుతున్నారు. బీ స్ట్రాంగ్ అని చెబుతున్నారు. సమంత పర్టికులర్‌గా 6 నెలలు కష్టంగా గడిచిందని మెసేజ్ పెట్టటానికి కారణం.. ఆమె గ్యాప్ తీసుకోకుండా కంటిన్యూగా షూటింగ్‌లో పాల్గొంటూ వచ్చింది.