Entertainment మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ చిత్రాలు వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న సంగతి తెలిసిందే ఒక్కరోజు తేడాతో వీరిద్దరి సినిమాలు విడుదల కావడంతో ఇరువురి అభిమానులు ఇప్పటినుంచి తమ హీరో గొప్ప అంటే తన హీరో గొప్ప అంటూ వాదనకొస్తున్నారు ఈ విషయం ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుండగా సీనియర్ దర్శకుడు గీత కృష్ణ చేసిన కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోసినట్టు తయారయ్యాయి..
చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య నందమూరి బాలకృష్ణ నటించిన వీర నరసింహారెడ్డి సినిమాలు వచ్చే ఏడాది సంక్రాంతికి ఒక్కరోజు తేడాతో విడుదలవుతున్నాయి ఒకప్పుడు ఇద్దరు సీనియర్ హీరోలు సినిమాలు ఒకేరోజు విడుదల అవ్వటం చాలా సాధారణ విషయంగా ఉండేది తర్వాత ఈ ధోరణి మార్చేసుకున్నారు హీరోలు.. అయితే ప్రస్తుతం మాత్రం సోషల్ మీడియా వేగంగా అభివృద్ధి చెందడంతో ఏ చిన్న విషయం జరిగిన దానిమీద రచ్చ పెద్ద స్థాయిలోనే జరుగుతుంది తాజాగా ఈ విషయంపై కూడా వాదనలు జరుగుతుండగా సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ యూట్యూబ్లో చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి..
గీతాకృష్ణ తన యూట్యూబ్ చానెల్ ద్వారా తన అభిప్రాయాలను, విశ్లేషణలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి బాలకృష్ణ వీరిద్దరిలో ఇద్దరిలో ఎవరు గొప్ప అని ప్రశ్నించగా.. “ఎవరు గొప్పేంట్రా స్టుఫిడ్ ఫెలో. చిరంజీవి ఇప్పటికే తనేంటో నిరూపించుకున్న నటుడు. మట్టిలో నుంచి పుట్టిన మాణిక్యం. ఎన్టీ రామారావు పేరు చెప్పుకొని వచ్చినోడు బాలకృష్ణ. చిరంజీవి స్థాయికి బాలకృష్ణ ఎప్పటికీ చేరుకోలేడు. ఈ మధ్యన జై బాలయ్య అనే మూమెంట్ ఎందుకొచ్చింది.. వాడెవడో డైరెక్ట్ చేసిన రెండు సినిమాలు హిట్ అయ్యాయి కాబట్టి. దాని తరవాత అందరూ కలిసి కాలర్ ఎత్తేస్తున్నారు. నేను ఫ్యాన్స్‌కు చెప్పట్లేదు. జనరల్‌గా చెప్తున్నాను. చిరంజీవిని ఎవ్వరూ బీట్ చేయలేరు. బాలకృష్ణకు కొంతకాలం నడుస్తుంది. అతని సినిమాలకు థియేటర్లు కూడా ఇవ్వలేదని వాడెవడో ప్రొడ్యూసర్ ఆత్మహత్య కూడా చేసుకోబోయాడు” అని గీతాకృష్ణ వ్యాఖ్యానించారు