Entertainment ప్రేక్షకులకు ఎలాంటి అంచనాలు లేకుండా ఓ చిన్న సినిమాగా విడుదలైన డిజే టిల్లు చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే.. అయితే ఈ చిత్రంతో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ మంచి విజయాన్ని అందుకున్నాడు అంతేకాకుండా తన కెరీర్ను మలుపుతిప్పుకోవడానికి ఈ చిత్రం మంచి అవకాశం గా మారింది దీంతో ఒకసారిగా ఆయన క్రేజ్ కూడా మారిపోయింది అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ను దీపావళి సందర్భంగా చిత్ర బృందం అందించింది..
డీజే టిల్లు.. అన్ని తరాల వారిని ఈ చిత్రం చాలా చక్కగా అలరించింది ముఖ్యంగా ఇందులో సిద్దు జొన్నలగడ్డ చెప్పినా డైలాగ్స్ కామెడీ పంచులు జనాలకి బాగా కనెక్ట్ అయ్యాయి.. సినిమాతో ఆ హీరో క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది అంతేకాకుండా ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో పంచ్ డైలాగ్ అట్లుంటది మనతో అంటూ మూవీ ప్రమోషన్ లో వాడేసాడు.. అయితే ఇంతగా అందర్నీ అలరించిన ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని చిత్ర బృందం ప్రకటించేసింది అయితే అప్పటి నుంచి దీనికి సంబంధించి అప్డేట్ ఎప్పుడు వస్తుందా? సీక్వెల్ ఎప్పుడు రాబోతుందా అని జనాలు ఎంత వాసుగా ఎదురు చూస్తున్నారు అయితే దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ను తాజాగా చిత్ర బంధం అందించింది.. ఈ సీక్వెల్ కు ‘టిల్లు స్క్వేర్’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ఈసారి డబుల్ ఫన్, డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉండనుందట. కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. కాగా ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది.