Health Tips: పుదీనా మసాలాగా, పుదీనా టీ , పుదీనా పచ్చడిగా రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా పొదలలో అనేకమైన సుగుణాలు కలిగి ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట పుదీనా ను తమ ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు..పుదీనా ఆకుల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది.ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరెన్నో ఆరోగ్యమైన చిట్కాలు పుదీనా ద్వారా తెలుసుకుందాం..
పుదీనా ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణ సమస్యలను అంతేకాదు ఇవి జీర్ణక్రియ ప్రక్రియను వేంగవంతం చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.పుదీనా ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటాయి ఇవి శ్వాస సంబంధిత సమస్యలను తొలగిస్తాయని ఆయుర్వేదం తెలుపుతున్నారు.. ఆస్తమా సమస్యతో బాధపడేవారు పుదీనా ఆకులను తమ ఆహారంలో తీసుకోవడం మంచిదని తెలుపుతున్నారు.దోమలు కుట్టడం వల్ల చర్మంపై దద్దుర్లు దురద వంటి సమస్యలు ఏర్పడినప్పుడు పుదీనా ఆకుల రసాన్ని రాసుకోవడం ద్వారా దురద వంటి సమస్యలు మటుమాయం అవుతాయి అదేవిధంగా చర్మం కూడా అందంగా మృదువుగా తయారవుతుంది.పుదీనా నిమ్మ ను కలిపి సేవించడం ద్వారా అధిక బరువు, ఆందోళన, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
మొటిమల సమస్యలు బాధపడేవారు వారానికి రెండుసార్లు పోదన ఆకులను మెత్తటి పేస్టులాగా చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవడం ద్వారా మొటిమల సమస్యలతో పాటు అందమైన శరీరాకృతిని పొందవచ్చు. ప్రస్తుతం పెద్దవారి నుంచి చిన్నపిల్లలు సైతం పాదాల పగుళ్ళు వంటి సమస్యతో బాధపడుతున్నారు. అయితే పుదీనా ఆకులను వేడి నీటితో మరగపెట్టి ఆ వేడి నీటిలో కాస్త బేగం సోడా వేసి కాళ్ళను పెట్టుకోవడం ద్వారా పాదాల పగులకు స్వస్తి చెప్పవచ్చు.