Entertainment కన్నడలో స్టార్ హీరోగా పేరు ఉన్న దర్శన్ కు తాజాగా చేదు అనుభవం ఎదురయింది తాజాగా ఇతను నటించిన క్రాంతి చిత్రం త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతుంది ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఒక కార్యక్రమానికి హాజరైన ఈయనను ఒక అభిమాని ఘోరంగా అవమానించాడు..
కన్నడ స్టార్ హీరో దర్శన్ పలుమార్లు ఇప్పటికే ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు ఒకసారి హిందూ దేవుళ్లను కించపరుస్తూ మాట్లాడుతూ.. అలాగే నటుడు పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ను పరుస్తూ మాట్లాడుతూ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు అయితే దీనిలో కారణం ఏదైనాప్పటికీ అభిమాని మాత్రం అందరిలోనే ఈయనపై చెప్పుతో దాడి చేశాడు..
స్టేజ్ పై నిల్చోని అభివాదం చేస్తున్న దర్శన్ ను చెప్పుతో కొట్టాడు అభిమాని అయితే గత కొన్నాళ్ల క్రితం ఈయన దివంగత నటుడు పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి నా అభిమానులంతా నన్ను బతికుండగానే అభిమానిస్తున్నారు ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ ని ఉదాహరణగా తీసుకుంటే ఆయన చనిపోయిన తర్వాత మాత్రమే అభిమానులు ఆయనపై ఆసక్తి అభిమానం చూపిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు అయితే ఈ మాటలు అప్పట్లో వైరల్ గా మారాయి అయితే ఇప్పుడు అభిమాని చెప్పుతో కొట్టిన సంఘటన అనంతరం ఈ విషయంపై స్పందించారు శివరాజ్ కుమార్ మనమంతా ప్రేమతో ఉందాం అభిమానం పంచుదాం. ఇలాంటి వాటి జోలికి అస్సలు పోవద్దు అంటూ తన పెద్ద మనసును చాటుకున్నారు..