Faria Abdullah : జాతిరత్నాలు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఫరియా అబ్దుల్లా. ఈ మూవీతో తనదైన కామెడీ టైమింగ్తోనే కాకుండా హైట్ పరంగానూ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది ఈ భామ. ఇక ఇప్పుడు ఈ అమ్మడు వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఇటీవల బంగార్రాజు చిత్రంలో స్టెప్పులేసి అలరించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత డిఫరెంట్ కథల కోసం వెయిట్ చేసిన ఫరియా… మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సంతోష్ శోభన్ తో కలిసి ‘లైక్, షేర్ & సబ్‌స్క్రైబ్’ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ రావడంలో సినీ వర్గాల్లో మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ మూవీ నవంబర్ 4వ తేదీన థియేటర్లలో రిలీజ్ అవ్వనుండగా మూవీ ప్రమోషన్లను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో ఫరియా, సంతోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలీ ప్రశ్నలకు ఫరియా ఫన్నీగా స్పందించారు. ఈ షోలో అలీ అడిగిన ప్రశ్నలక సరదాగా ఆన్సర్ ఇచ్చింది ఫరియా. ఈ క్రమం లోనే జాతిరత్నాలు షూటింగ్ సమయంలో నిన్ను డైరెక్టర్ అనుదీప్ కొట్టారట కదా అని అడగ్గా… ” అది సరదాగా జరిగింది. ఆయన జోక్స్ వేసినప్పుడు నవ్వుతూ పక్కనున్న వాళ్లని కొడతారు. అది ఆయనకు అలవాటు. అలా ఒకసారి నన్ను చేత్తో అలా అన్నారు. అంతే ” అంటూ చెప్పుకొచ్చింది.
అలానే తాను మొదటి నుంచి కూడా హిందీ సినిమాలను ఎక్కువగా చూసేదానినంటూ చెప్పారు. మొదటిసారిగా చూసిన తెలుగు సినిమా ‘వర్షం’ అని… అది చూసిన దగ్గర నుంచి త్రిషకు ఫ్యాన్ అయిపోయానంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఆమె కోసమే ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చాలా సార్లు చూశానన్నారు. ఏ దర్శకుడితో చేయాలని ఉందంటూ అలీ అడుగగా రాజమౌళిగారి దర్శకత్వంలో చేయాలనుందంటూ మనసులో మాట బయటపెట్టింది.