Health : ద్రాక్ష పళ్ళను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటుంటారు ఆరోగ్య నిపుణులు వీటిని నిత్యం తీసుకోవడం వల్ల శరీరం తో పాటు చర్మం కూడా ఎంతో నిగారింపును సంతరించుకుంటుంది అంతేకాకుండా రక్తాన్ని శుద్ధి చేయటానికి కూడా ఇది ముఖ్యపాత్ర పోషిస్తాయి అయితే ద్రాక్ష పళ్ళతో పాటు ఆ గింజల్లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తాజా అధ్యయనాల్లో తెలుస్తోంది..
ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తినే పల్లెలో ద్రాక్ష పండు కూడా ఒకటి అయితే ఈ ద్రాక్ష పండ్లతో పాటు వాటి గింజల్లో కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుస్తుంది.. ద్రాక్ష గింజలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరిగేటట్టు చేయటమే కాకుండా రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయి.. అలాగే గుండెకు సక్రమంగా రక్తాన్ని పంపచేయడంలో కూడా ఇది ప్రముఖ పాత్ర పోషిస్తాయి..
ద్రాక్ష గింజల్లో ఉండే ఎన్నో పోషకాలు మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా మెదడులో ప్రోటీన్ లోపం వల్ల వచ్చే అల్జీమర్స్ కూడా నివారించడంలో ఇవి ప్రముఖ పాత్ర వహిస్తాయి.. ద్రాక్ష పళ్ళు కళ్ళ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి అంతేకాకుండా ఎముకలు బలంగా తయారవ్వటానికి కూడా ఇవి సహాయ పడతాయి..