Health Tips : బెల్లంను నిత్యం ఏదో ఒక వంటకాల్లో వినియోగిస్తూనే ఉంటాం. బెల్లం తినడం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. కొన్ని స్వీట్స్ లో చక్కెరకు బదులుగా బెల్లంను ఉపయోగిస్తారని అందరికీ తెలిసిందే. అయితే చక్కెరకి బదులు బెల్లం తినడం వల్ల ఆరోగ్యానికి మరింత మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శీతాకాంలో పలు సమస్యలను ఎదుర్కొనేందుకు బెల్లాన్ని ఎక్కువగా తీసుకుంటారు. కడుపు నొప్పి సమస్యలు, రక్తహీనత తదితర సమస్యలకు క్రమం తప్పకుండా బెల్లం తినడం మంచిదని డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు. కాగా ఉదయం లేచిన వెంటనే బెల్లం తీసుకోవడం వల్ల కూడా అనేక ఉపయోగాలు ఉన్నట్లు తెలుస్తుంది. అవేంటో మీకోసం ప్రత్యేకంగా…
రక్తాన్ని శుద్ది చేస్తుంది : బెల్లం శరీరంలోని మలినాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేయడంలో బాగా పని చేస్తుంది. అలానే గొంతు, ఊపిరితిత్తుల సంబంధించిన ఇన్ఫెక్షన్లు సోకకుండా బెల్లం పని చేస్తుంది.
బరువును కంట్రోల్ చేస్తుంది : జీర్ణక్రియ సంబంధిత సమస్యలతో బాధపడే వారు బెల్లం తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలానే అధిక బరువును తగ్గించేందుకు కూడా బెల్లం ఉపయోగపడుతుందని అంటున్నారు.
బీపీని అదుపులో ఉంచుతుంది : రక్తపోటును నియంత్రించడంలో బెల్లం చాలా సహాయపడుతుంది. బెల్లంలో ఉండే పొటాషియం, సోడియం శరీరంలోని యాసిడ్ పరిమాణాన్ని తగ్గించడంలో బాగా పని చేస్తాయి. అందుకే ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం తింటే ఎన్నో లాభాలు ఉన్నాయి.
కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి : ఉదయాన్నే బెల్లం తినడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి కూడా చాలా ఉపశమనం పొందుతారు. ముఖ్యంగా చలికాలంలో ఎక్కువ మంది కీళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. అలాంటి వారు ప్రతిరోజూ ఉదయం బెల్లం తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఐరన్ పెంపుదల : శరీరంలో ఐరన్ లోపంతో ఉన్నవారు బెల్లం ఎక్కువగా తినాలని డాక్టర్లు చెబుతున్నారు. బెల్లంలో ఉండే ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలు బెల్లంలో పుష్కలంగా ఉంటాయి.