Noodles : కాలంతో పాటు మారుతున్న జీవితాల్లో ప్రస్తుతం అందరూ ఉరుకులు, పరుగులు పెడుతూ ఆరోగ్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ముఖ్యంగా మారిన జీవనశైలి, బిజీ లైఫ్ కారణంగా ఎక్కువ మంది ఇన్ స్టెంట్ ఆహారాల మీద ఎక్కువ ఆధార పడుతున్నారు. ఈ ఫాస్ట్ ఫుడ్స్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నూడుల్స్ గురించి. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే వాటిలో నూడుల్స్ కూడా ఉంటుంది. వీటిని తయారుచేయడానికి ఎక్కువ సమయం పట్టకపోవటంతో… అందరూ వీటిని ఎక్కువగా తింటున్నారు. అయితే ఎక్కువగా నూడుల్స్ తినడం వల్ల ఆరోగ్యానికి వాటిల్లే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
- నూడుల్స్ లో ఎటువంటి ప్రోటీన్స్,మినరల్స్ ఉండవు.
- నూడుల్స్ తయారిలో ఎక్కువగా నూనెను ఉపయోగిస్తారు.
- వీటిలో కార్బో హైడ్రేడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల వీటి వల్ల షుగర్ లెవల్స్ కూడా పెరుగుతాయి.
- మసాలాలు, ఉప్పు, మోనోసోడియం గ్లుటామేట్ కూడా ఉంటాయి. మోనోసోడియం గ్లుటామేట్’ అనే రసాయన
- సమ్మేళనం శరీరంలోకి ప్రవేశించడం వల్ల, రక్తపోటుకు కారణమవుతుంది. మోతాదుకు మించి సోడియం తీసుకోవడం వల్ల క్యాన్సర్, స్ట్రోక్, గుండె జబ్బులు, అధిక రక్తపోటుతో పాటు మూత్రపిండాల సమస్యలు తలెత్తుతాయి. వాటినిలోని హానికరమైన పదార్థాల కారణంగా మెటబాలిజం రేటు తగ్గుతుంది. ఫలితంగా బరువు పెరుగుతారు.
- నూడుల్స్ తింటే జీర్ణవ్యవస్థలో సమస్యలు తలెత్తుతాయి.
- రాత్రివేళ తీసుకునే ఆహారంలో నూడుల్స్ వంటి వాటిని తీసుకోకపోవటమే మంచిది.
- నూడుల్స్ తినాలని అనుకునే వారు వాటిలో ఆకుకూరలు, బీన్స్, బఠాణి వంటివి వేసి తినాలని దకటర్లు సూచిస్తున్నారు.
- నాన్ వెజ్ తినేవారు అయితే నూడుల్స్ తయారు చేసినప్పుడు గుడ్లు, మాంసం, చికెన్ వంటివి కూడా వేసుకోవచ్చు.
- వారానికి ఒకటి లేదా రెండు సార్లు నూడుల్స్ తింటే మంచిదని చెబుతున్నారు.