Health Tips : నిద్ర మనిషి జీవితంలో చాలా ముఖ్యం ఒకరోజు సరిగ్గా నిద్ర పట్టకపోతే ఆ రోజంతా ఏదో వెరైటీగా అనిపిస్తుంది. అయితే చాలామందిని వేధించే సమస్య నిద్రలేమి. అయితే కొందరు ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు వారికి అలాంటి వారు ఒక్కసారి ఈ ఆయిల్ ప్రయత్నించి చూడండి…
ప్రశాంతంగా నిద్రపోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసమే వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే… కొన్ని రకాల ఆయిల్ లను వాడితే ప్రశాంతంగా నిద్రపోవడానికి సహకరిస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఎసెన్షియల్ ఆయిల్స్ ఇందుకు ఎక్కువగా సహకరిస్తాయన్నారు. సంపెంగ వాసన చూడటానికి చాలా బాగుంటుంది మనసుకి మెదడుకి ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తుంది. అలాగే ఈ నూనె నిద్రకి కూడా మంచి చిట్కాగా చెప్తారు. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లలో రెండు చుక్కల సంపంగి నూనె వేసుకుని స్నానం చేస్తే చక్కటి నిద్ర పడుతుందని ఆయుర్వేదం తెలుపుతుంది. అలాగే ఒత్తిడి ఆందోళన తగ్గించడంలో కూడా సంపంగి సహాయపడుతుంది.
అలాగే మెదడుకి ఉల్లాసాన్ని కలిగించడంలో ఫ్రాంకెన్సెస్ ఆయిల్ కూడా పాత్ర పోషిస్తుంది. ఇది మెదడుని ఒత్తిడి నుండి దూరం చేసి ప్రశాంతమైన నిద్రకు చేరువ చేస్తుంది.. గదిలో ఓ మూల నాలుగు చుక్కల లావెండర్ నూనె ను చిన్న గిన్నెలో వేసి ఉంచటం వల్ల రాత్రంతా చక్కని నిద్ర పడుతుందని తెలుస్తోంది..