Health Tips : శీతాకాలం ప్రారంభమయ్యి చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కూడా పడిపోయాయి. ఈ తరుణం లోనే రాబోయే రోజుల్లో చలిగాలుల మరింత పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. కాగా ఇతర సీజన్లతో పోల్చితే శీతాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నవంబర్ నెల ప్రారంభంలో కొన్ని వ్యాధులు విజృంభించే అవకాశం ఎక్కువగా ఉంది. వాటి నుంచి రక్షణ పొందేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో మీకోసం ప్రత్యేకంగా…
న్యుమోనియా : శీతాకాలంలో ఎక్కువగా వచ్చే వ్యాధుల లిస్టులో న్యుమోనియా ముందు వరుసలో ఉంటుంది. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్‌ల పెరుగుదల వల్ల వచ్చే ఊపిరితిత్తుల వ్యాధి ఇది. న్యుమోనియాను నివారించడానికి, వీలైనంత వరకు హైడ్రేటెడ్‌గా ఉండటం అవసరం. వీటితో పాటు అల్లం, వెల్లుల్లిని మీ ఆహారంలో చేర్చుకోవాలి.
గొంతు ఇన్ఫెక్షన్ : ఈ సీజన్‌లో గొంతు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఈ సమస్యతో మాట్లాడడంతో పాటు తినడానికి కూడా కష్టంగా ఉంది. అందుకే గోరువెచ్చని నీటిలో కాస్త తేనెను కలుపుకుని తాగాలి. అలాగే ఐస్ క్రీం, వేయించిన ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది.
ఆర్థరైటిస్ : చలికాలంలో ఈ కీళ్ల వ్యాధి సమస్య మరింత పెరుగుతుంది. ఇది మోకాళ్లలో వాపుకు కారణమవుతుంది. దీని నుంచి రక్షణ పొందడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసువాలి. అలాగే అధిక బరువును నియంత్రించుకోవాలి.
సీజనల్ వ్యాధులు : నవంబర్‌లో చాలామంది తరచుగా జలుబు, దగ్గు వంటి సమస్యల బారిన పడతారు. చల్లటి గాలుల కారణంగా జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, తల తిరగడం వంటి సమస్యలు కలుగుతాయి. వీలైనంత వరకు చలి నుంచి రక్షణ కలిగించే దుస్తులు ధరించడం మంచిది. అలాగే నోరు, ముక్కులక అడ్డంగా స్కార్ఫ్ ధరించాలి.