Entertainment కొందరు నటినటులకు విమానాశ్రయాల్లో ఎప్పటికప్పుడు ఇబ్బందులు తోనే ఉంటాయి పెద్ద పెద్ద స్టార్ హీరోలకు సైతం ఈ బాధ తప్పలేదు అయితే తాజాగా సౌత్ ఇండియా హీరో సిద్ధార్థ ఇదే సమస్యను ఎదుర్కొన్నాడు అయితే ఇది జరిగింది ఎక్కడో కాదు తన సొంత రాష్ట్రం తమిళనాడులోనే జరగటం ప్రస్తుతం వైరల్ గా మారింది.. అయితే ఈ విషయంపై విమానాశ్రయ సిబ్బందికి కంప్లైంట్ చేశానని చెప్పుకొచ్చిన ఈ హీరో సోషల్ మీడియా వేదికగా వారిపై అయ్యాడు
సిద్ధార్థ తమిళనాడుకు చెందిన నటుడు అయితే టాలీవుడ్ లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈయనకు తమిళనాడు మదురై విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురయింది తన తల్లిదండ్రులతో విదేశాలకు వెళ్లి వస్తుండగా ఏ కారణం లేకుండా సిఆర్పిఎఫ్ సిబ్బంది అతన్ని దుర్భాషలాడారు అలాగే ఎంతగా కారణం అడిగినా అతనికి సమాధానం చెప్పలేదు.. అలా చాలాసేపు నిల్చోబెట్టి తిడుతూనే ఉన్నారు
20 నిమిషాల పాటు పదిరకాల మాటలతో దుర్భాషలాడారు అయితే ఆ మాటలు హిందీలో ఉండటం వల్ల ఇంగ్లీషులో మాట మాట్లాడాలంటూ ఎంతగా కోరిన చెప్పలేదు సరి కదా జోబిలో ఉన్న వస్తువులన్నీ తీసి బయట పెట్టాలి అంటూ ఇబ్బంది పెట్టారు దీంతో వృద్ధాప్యంలో ఉన్న అతని తల్లిదండ్రి ఎంతగానో ఇబ్బంది పడ్డారని ఈ విషయం తనను ఎంతగా ఎంతగానో బాధించిందని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు ఈ హీరో.. అయితే ఈ విషయంపై విమానాశ్రయ సిబ్బందికి తాను కంప్లైంట్ చేసినట్టు కూడా తెలిపాడు..