Entertainment టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ నోటీసులు అందించినట్టు తెలుస్తోంది డ్రగ్స్ కేసులో ఈమె పేరు వినిపించిన నేపథ్యంలో ఈ డి మరోసారి ఈమెకు నోటీసులు జారీ చేసిందని సమాచారం.. విచారణకు రావాలని తెలిపినట్టు తెలుస్తోంది..
అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో బాలీవుడ్లో మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ భామ వరుస సినిమాలు చేస్తూ కెరియర్లో మంచి బిజీగా ఉంది అయితే తాజాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈమె పేరు వినిపించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈడి విచారణకు హాజరైన రకుల్ను దాదాపు 6 గంటలకు పైగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే అయితే మరోసారి ఈ విషయం కలకలం రేపింది.. దీనికి సంభందించి ఈడి మరొకసారి ఈమెకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.. త్వరలోనే విచారణకు రావాలని తెలిపినట్టు కూడా తెలుస్తోంది..
టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం గతంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసుకు సంబంధించి పలువురు ఫిలిం స్టార్లను గతేడాది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారిచింది. ఇప్పుడు ఎలాంటి ఆధారాలు లభించలేదు ఈ క్రమంలోనే ఈడీ ప్రత్యేకంగా మరొకసారి వీరందరికీ నోటీసులు జారీ చేస్తుంది అనే వార్తలు వినిపించాయి.. తాజాగా రకుల్ ప్రీత్‌తో పాటు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేసి షాక్ ఇచ్చింది. వీరిని ఈ నెల 19న విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది.