Hit 2 Movie : శైలేష్ కొలను దర్శకత్వంలో అడవి శేష్ హీరోగా వస్తున్న తాజా చిత్రం హిట్ – 2. నేచురల్ స్టార్ నాని ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విశ్వక్ సేన్ హీరోగా 2020 లో ‘హిట్ – ది ఫస్ట్ కేస్’ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి.
కాగా ఇటీవలే ఈ సినిమా టీజర్ ను మూవీ టీం విడుదల చేయగా… టీజర్ ఆద్యంతం అలరిస్తూ ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ టీజర్ లో అడివి శేషు యాక్టింగ్ ఒక ఎత్తు అయితే… టీజర్ చివరిలో వచ్చే సీన్ మరొక ఎత్తు అని చెప్పాలి. ఇక యూట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉన్న ఈ టీజర్ ని సడన్ గా యూట్యూబ్ యాజమాన్యం తొలిగించింది. దీని గురించి అడివి శేషు స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేశాడు.
ఆ వీడియోలో… టీజర్ లో హింసాత్మక సన్నివేశాలు ఉండడంతో యూట్యూబ్ హిట్- 2 టీజర్ ని ట్రేండింగ్ లిస్ట్ ని నుంచి తొలిగించింది. అంతే కాకుండా 18 ఏళ్ళ వయసు కంటే తక్కువ వయసు ఉన్న వారు చూడకుండా ఏజ్ రెస్ట్రిక్షన్ కూడా పెట్టింది. భవిషత్తులో ఈ టీజర్ మళ్ళీ చూడాలంటే యూట్యూబ్ లో సైన్ ఇన్ అయ్యి చూడాల్సిందే అని చెప్పారు. అలానే సినిమాలో వైలెన్స్ మాత్రమే కాదు రొమాన్స్ కూడా ఉందని… రేపు మూవీ లోని ఫస్ట్ సింగల్ ‘ఉరికే ఉరికే’ ఫుల్ సాంగ్ విడుదల కాబోతున్నట్లు వెల్లడించాడు.