Health Tips : మారుతున్న కాలం తీసుకుంటున్న ఆహారం వివిధ మార్పులు జరగడం వలన అనేకమైన సమస్యలు ఏర్పడుతున్నాయి అందులో మరి ముఖ్యమైనది నోటి దుర్వాసన. నోటి దుర్వాసన వల్ల మనం నలుగురిలో కూర్చుని మాట్లాడలే అలానే ఒంటరితనం అనేది అధికమవుతుంది. అయితే నోటి దుర్వాసన అనేది సాధారణంగా నోటిని శుభ్రంగా కడగకపోవడంతో అలానే దీర్ఘకాల నోటి వ్యాధుల వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. నోటి దుర్వాసనతో బాధపడేవారు ఉల్లిపాయ వాడకాన్ని తగ్గించడం మంచిది అని వైద్యులు చెబుతున్నారు. నోటి దుర్వాసన తగ్గించేందుకు మన ఆహార నియమాలలో మార్పులు చేసుకుంటే నోటి దుర్వాసన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అవి ఏంటో తెలుసుకోండి మరి.
దానిమ్మ ,నిమ్మకాయ, నారింజకాయ,బత్తాయి వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది బ్యాక్టిరియాను కంట్రోల్ చేసి నోటి సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. అలానే చిగుళ్ల వాపు నోటి నుంచి రక్తం రావడం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. అలానే గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కూడా నోటి దుర్వాసన పోగొట్టుకోవచ్చు.గ్రీన్ టీలో కాటెచిన్ అనే ఎనర్జిటిక్ యాంటీఆక్సిడెంట్ ఉంటుంది ఇది బ్యాక్టీరియాను పోగొట్టడంలో చక్కగా పనిచేస్తుంది.
అలానే అల్లం కూడా నోటి దుర్వాసనను రానివ్వకుండా అదుపు చేయడంలో ఉపయోగపడుతుంది. రోజు పరగడుపున తులసి ఆకులను లేదా వేప ఆకులను నవలడం ద్వారా నోటి దుర్వాసన సమస్యకు స్వస్తి చెప్పవచ్చు. ఇది కేవలం నిపుణులు సూచించిన మేరకు మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. అటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.