Health చాలా చిన్న సమస్య కనిపించిన ఎన్నో ఆరోగ్య సమస్యలను తీసుకువచ్చేది హైబీపీ.. దీన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా గుండెపోటు, కిడ్నీలు దెబ్బతినడం, మానసిక సమస్యలకి దారి తీస్తుంది. అయితే సరైన అలవాట్లు ద్వారా హై బీపీ ను కంట్రోల్ చేసుకోవచ్చు…
ఈ రోజుల్లో చాలామందిని వేధించే సమస్య హైబీపీ మారిపోతున్న ఆహార అలవాట్లు మద్యపానం ధూమపానం వంటివన్నీ కూడా దీనికి కారణాలు అయితే మన ఆహార అలవాట్లు మార్చుకుంటూ తగినంత వ్యాయామం చేస్తే హైబీపీని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు.. ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే హైబీపీ తప్పకుండా ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా అసలు ఎండ తగలకుండా నీడపట్టనే ఉన్నవాళ్లకి ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది రోజు ఉదయాన్నే కాసేపు ఎండలో నడవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ డి అందుతుంది.. దీంతో ఎముకలు బలంగా మారటమే కాకుండా మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది..
నేను నిద్ర లేకపోతే కచ్చితంగా హై బీపీ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది రోజు కచ్చితంగా ఏడ నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం అవసరం. ఇలా లేని సందర్భాల్లో ఆరోగ్యం దెబ్బతిని హై బీపీ కంట్రోల్ తప్పుతుంది.. సరైన నిద్ర లేకపోతే ఒత్తిడి పెరిగిపోతుంది దీనివల్ల మరిన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి అలాగే ఫాస్ట్ ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. వీలైనంతవరకు ఫాస్ట్ ఫుడ్ ను తీసుకోకపోవడం మంచిది అలాగే వంటరితనంతో బాధపడే వాళ్ళలో కూడా హైబీపీ రిస్క్ ఎక్కువగానే ఉంటుంది..