Entertainment బాలీవుడ్ అందగాడు కండల వీరుడు హృతిక్ రోషన్ అందానికి ఎందరో పడిచస్తూ ఉంటారు ముఖ్యంగా తన ఫిట్నెస్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు అయితే దేని వెనుక ఎంతో తేలికైన పని కాదు అంటూ చెప్పకు వచ్చేది హీరో..
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని విషయాల కోసం చెప్పుకొచ్చారు.. అలాగే ఫిట్నెస్ను సాధించడం అంత తేలికైన విషయం కాదని ఇందుకోసం ప్రయత్నిస్తూ ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు గతంలో ఒక సినిమా కోసం చాలా ఎక్కువగా ఫిట్నెస్ కి ప్రయత్నించి అలసిపోయానని ఆ సమయంలో డిప్రెషన్ లోకి కూడా వెళ్లానని చెప్పుకొచ్చాడు హృతిక్ రోషన్..
2019లో వచ్చిన వార్ చిత్రంలో హృతిక్ రోషన్ పవర్ఫుల్ పాత్రను పోషించారు ఈ సినిమాలో నటించిన ముందు శరీరాన్ని ఒక ఆకృతికి తేవడానికి ఎంతగానో కష్టపడ్డానని తెలిపారు.. అలాగే “గతంలో వార్ సినిమాలో నటించాను అయితే అప్పుడు ఆ సినిమాలో ఉన్న పాత్రకి తగినట్టుగా నా దేహం లేదు అందుకు తగినట్టు నా శరీరాకృతిని మార్చుకోవడం నాకు నిజంగా సవాలుగా అనిపించింది కానీ పాత్ర కోసం చాలా ప్రయత్నించా పర్ఫెక్షన్ కోసం ఎంతగానో ట్రై చేశా.. అయితే సినిమా చిత్రీకరణ పూర్తయ్య సమయానికి పూర్తిగా అలసిపోయాం. ఒకానొక సమయంలో డిప్రెషన్ అంచుల వరకు వెళ్లొచ్చా ఆ సమయంలో చనిపోవాలి అనే ఆలోచనలు కూడా వచ్చాయి అప్పుడే నాకు జీవితంలో మార్పు అవసరమని మారాలని అర్థమైంది.. ” చెప్పుకొచ్చారు హృతిక్ రోషన్..