Viraj Ashwin : విరాజ్ అశ్విన్ (Viraj Ashwin), ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘బేబీ’. SKN నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజయిన సాంగ్స్ బాగా హిట్ అయ్యాయి. పాటలు, ట్రైలర్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ‘బేబీ’ సినిమా జులై 14న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాతో హీరో విరాజ్ అశ్విన్ మరో స్థాయికి వెళ్లనున్నాడు.
అనగనగా ఓ ప్రేమ కథతో అరంగేట్రం చేశాడు యంగ్ హీరో విరాజ్ అశ్విన్. తొలి సినిమాతోనే తన నటనతో మెప్పించిన విరాజ్ ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు VN ఆదిత్య దర్శకత్వంలో ‘వాళ్ళిద్దరి మధ్య’ అనే సినిమా చేశాడు. అనంతరం ‘థ్యాంక్యూ బ్రదర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు ఏర్పడింది. నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలతోనే కాక విరాజ్ అశ్విన్ తన షార్ట్ ఫిల్మ్ “మనసానమహ”తో ఓ సెన్సెషన్ క్రియేట్ చేశాడు. ఈ షార్ట్ ఫిల్మ్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక అవార్డులు పొందిన షార్ట్ ఫిల్మ్ (513 అవార్డులు)గా గిన్నిస్ రికార్డ్ సాధించింది.
సినీ పరిశ్రమలో ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ విరాజ్ అశ్విన్ కు సొంత మేనమామ అవుతారు. ఇటీవలే పాయల్ రాజ్‌పుత్ తో కలిసి మాయాపేటిక అనే సినిమాతో కూడా మెప్పించాడు విరాజ్. ఇలా వరుస సినిమాలతో ఫామ్ లో ఉన్న విరాజ్ అశ్విన్ ఇప్పుడు బేబీ సినిమాతో రాబోతున్నాడు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యలతో కలిసి బేబీ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు విరాజ్.