Niharika Konidela Divorce : మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా నిహారిక అందరికి పరిచయమే. టీవీ షోలలో యాంకర్ గా, సిరీస్, సినిమాల్లో నటిగా, హీరోయిన్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది నిహారిక. నిహారిక ప్రస్తుతం సినిమాలు, సిరీస్ లతో నటిగా, నిర్మాతగా బిజీగా ఉంది. నిహారిక, చైతన్య జొన్నలగడ్డ అనే వ్యక్తిని 2020 లో ఘనంగా పెళ్ళి చేసుకుంది.
రాజస్థాన్ లోని ఓ రాజ్ మహల్ లో నిహారిక – చైతన్య పెళ్లి ఘనంగా జరిగింది. మెగా ఫ్యామిలీతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ పెళ్ళికి హాజరయ్యారు. వీరిద్దరిది అరేంజ్డ్ మ్యారేజ్ అనే సమాచారం. అయితే గత కొన్ని రోజులుగా నిహారిక, చైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అని వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలు డిలీట్ చేయడం, ఒకర్నొకరు అన్ ఫాలో చేయడంతో ఈ డౌట్ అందరికి మొదలైంది.
నిన్న నిహారిక – చైతన్య కు విడాకులు అయినట్టు కోర్టు అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో వీరిద్దరూ విడిపోయారు అని అంతా డిసైడ్ అయ్యారు. నేడు తాజాగా నిహారిక తన విడాకుల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ లో.. నేను, చైతన్య పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నాం. నాకు ఈ విషయంలో సపోర్ట్ గా నిలిచిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కి చాలా థ్యాంక్స్. మాకు ఈ సమయంలో కొంచెం ప్రైవసీ ఇవ్వండి. అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదాలు అని పోస్ట్ చేసింది. దీంతో నిహారిక పోస్ట్ వైరల్ గా మారింది. ఇక చైతన్య కూడా ఇదే విధంగా పోస్ట్ పెట్టాడు. ఇక వీరిద్దరి విడాకులకు కారణాలు మాత్రం తెలియలేదు.