Pawan Kalyan Instagram : సాధారణంగా సెలబ్రిటీలు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇస్తే అభిమానులు సంతోషిస్తారు, ఫాలోయింగ్ మరింత ఎక్కువవుతుంది. ఇక టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉన్నారు. అయితే పవన్ తన ట్విట్టర్ అకౌంట్ లో సినిమాల గురించి మాత్రం పోస్ట్ చేయరు. కేవలం పాలిటిక్స్, జనసేన పోస్టులు మాత్రమే పోస్ట్ చేస్తారు. తాజాగా పవన్ కళ్యాణ్ నిన్న ఇన్‌స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
నిన్న ఉదయం పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లో తన అధికారిక అకౌంట్ ని క్రియేట్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ టీం ఈ అకౌంట్ ని మేనేజ్ చేస్తుంది. అయితే ఇన్‌స్టాగ్రామ్ లో కూడా పవన్ జనసేనకు, పాలిటిక్స్ కి సంబంధించిన పోస్టులే చేస్తారని, సినిమాకు సంబంధించినవి మాత్రం చేయకపోవచ్చని సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లోకి వచ్చాడని తెలియగానే అభిమానులు, నెటిజన్లు, సెలబ్రిటీలు ఆయన్ని ఫాలో అవుతున్నారు. నిమిషం నిమిషంకి పవన్ అకౌంట్ కి ఫాలోవర్స్ భారీగా పెరిగారు. ఒక్కరోజులోనే పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కి ఏకంగా 1.7 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు.
పవన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తో సరికొత్త రికార్డు సృష్టించాడు. టాలీవుడ్ లోనే అత్యంత వేగంగా 1 మిలియన్ ఫాలోవర్స్ అందుకున్న హీరోగా రికార్డ్ సెట్ చేశాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కేవలం 6 గంటల 20 నిమిషాల్లోనే 1 మిలియన్ ఫాలోవర్స్ ని అందుకున్నారు. ఇక ఒక్కరోజులో 1.7 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. ఇప్పటివరకు ఏ టాలీవుడ్ హీరోకి ఇంత త్వరగా ఇంతమంది ఫాలోవర్స్ రాలేదు.