Rajini Kanth : సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ విదేశాల్లో సైతం కోట్లలో అభిమానులను సంపాదించుకున్నారు రజినీ. ఆయన స్టయిల్, డైలాగ్ డెలివరీ సినిమాలకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా నిలిచి విదేశాల్లో కూడా మంచి మార్కెట్ ఉన్న స్టార్ అంటే రజినీ అనే చెప్పాలి. రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రంలో రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్ కీలకపాత్రలో నటిస్తుండగా… తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అలానే యంగ్ హీరో శివ కార్తికేయన్ అతిథి పాత్రలలో మెరవనున్నారని సమాచారం. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయాలని భావిస్తున్నారట నిర్మాతలు. ఈ మేరకు యంగ్ హీరోలకు పోటీగా సమ్మర్ రేసులో సూపర్ స్టార్ తలైవా ఉండబోతుండడంతో ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి.
ఇటీవల రజినీ అనారోగ్య కారణాల వల్ల జైలర్ చిత్రీకరణ కొద్దిరోజులు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రజినీ పూర్తిగా కోలుకున్న తర్వాత ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే జైలర్ రిలీజ్ డేట్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఇంకా రావాల్సి ఉంది.