Ram Pothineni : 2019లో పూరి జగన్నాధ్ (Puri Jagannadh), రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ (ISmart Shankar) బ్లాక్ బస్టర్ హిట్ అయి ఇద్దరి కెరీర్ కి బూస్ట్ ఇచ్చింది. అప్పటిదాకా లవర్ బాయ్ లా కనిపించిన రామ్ ఈ సినిమాతో పూర్తిగా మాస్ గా మారిపోయాడు. ఈ సినిమా కోసం కొత్త గెటప్‌లో, కొత్త హెయిర్ స్టైల్‌తో కనపడ్డాడు. ఇస్మార్ట్ శంకర్ భారీ విజయం సాధించి కలెక్షన్స్ కూడా బాగా రాబట్టింది.
ఇదే కాంబినేషన్ లో ఈ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. డబల్ ఇస్మార్ట్ అనే టైటిల్ ప్రకటించి 8 మార్చ్ 2024లో రిలీజ్ చేస్తామని కూడా డేట్ ప్రకటించాడు పూరి. తాజాగా నిన్న జులై 10న ఈ డబల్ ఇస్మార్ట్ సినిమా అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పూరి జగన్నాధ్, రామ్, ఛార్మి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు చిత్రయూనిట్.
దీంతో రామ్ మళ్ళీ పూర్తిగా ఇస్మార్ట్ శంకర్ లా మారిపోయాడు. ఇన్ని రోజులు బోయపాటి వద్ద స్కంద సినిమా షూట్ చేసొచ్చిన రామ్ ఇప్పుడు డబల్ ఇస్మార్ట్ కోసం మళ్ళీ తన హెయిర్ స్టైల్ ని చేంజ్ చేశాడు. ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ రామ్ ని ఇస్మార్ట్ శంకర్ లా మార్చేశాడు. ఈ వీడియోని పూరి కనెక్ట్స్ నిర్మాణ సంస్థ తమ సోషల్ మీడియాలో షేర్ చేసి.. రేపట్నుంచి డబల్ ఇస్మార్ట్ షూటింగ్ మొదలవ్వబోతుందని ప్రకటించారు. దీంతో రామ్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.