Sai Pallavi : కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. SK21 వర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో శివ కార్తికేయన్ సరసన సాయిపల్లవి (Sai Pallavi) నటిస్తోంది. లోకనాయకుడు కమల్‌హాసన్(Kamal Haasan), ఆర్.మహేంద్రన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంస్థ సమర్పిస్తోంది. జి.వి ప్రకాష్ సంగీతాన్ని అందిస్తుండగా, సిహెచ్.సాయి సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. విశ్వరూం ఫేం రాహుల్ బోస్(RahulBose) విలన్‌గా నటిస్తున్నారు.
దేశ భక్తి కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్ర షూటింగ్ మే నెలలో చెన్నైలో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కశ్మీర్‌లో జరుగుతోంది. కాగా.. సాయి పల్లవి షూటింగ్ లోకేషన్‌లో దిగిన ఫోటోలు, రాహుల్ బోస్ మేకప్ వేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలా సాయిపల్లవి కాశ్మీర్ లో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి . అయితే ఈ నెలాఖరు వరకు కశ్మీర్‌లో చిత్రీకరణ జరగనుంది.
ఇదిలా ఉంటే.. మండేలా ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో మహావీరుడు చిత్రంలోనూ శివకార్తికేయన్ నటిస్తున్నారు. అదితి శంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల సినిమా ట్రైలర్‌ను విడుదల చేయగా, సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రంతో పాటు అయలాన్ (Ayalaan) చిత్రంలో కూడా నటిస్తున్నాడు శివకార్తికేయన్ . రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఆర్. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.