Sitara : టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురిగా సితార అందరికి పరిచయమే. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ సితార కూడా తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది. మహేష్ సినిమాలతో పాటే కమర్షియల్ యాడ్స్ కూడా ఎక్కువగా చేస్తూ, పలు సంస్థలకు బ్రాండ్ అంబాసడర్ గా ఉన్నాడు. ఇప్పుడు తండ్రి బాటలో కూతురు కూడా వెళ్తుంది. ఒక్క సినిమాలో కూడా కనపడకుండానే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది సితార.
ఇప్పటికే మహేష్ బాబుతో కలిసి పలు సీరియల్ ప్రమోషన్ యాడ్స్ లో కనిపించి అలరించింది సితార. ఇప్పుడు సింగల్ గా తానే ఒక కమర్షియల్ యాడ్ చేస్తూ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ప్రముఖ జ్యువలరీ బ్రాండ్ కి అంబాసడర్ గా వ్యవహరించబోతుంది సితార. ఈ బ్రాండ్ కి యాడ్ షూటింగ్ ని ఇటీవలే పూర్తి చేస్తారు. అందుకు సంబంధించిన షూటింగ్ సెట్ లోని వీడియోని, ఫోటోలను సితార తన ఇన్‌స్టాలో కూడా షేర్ చేసింది.
తాజాగా సితార చేసిన యాడ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను రిలీజ్ చేశారు. అంతేకాకుండా సితార నగలు ధరించిన ఫోటోలని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ప్రమోషన్ చేస్తున్నారు. దీంతో మహేష్ అభిమానులు సంతోషిస్తున్నారు. ఈ ఒక్క యాడ్ తోనే సితార ఎక్కడికో వెళ్ళిపోయింది, తండ్రిని మించిపోయింది కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే సితార చేసిన యాడ్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ లో ఆ నగల బ్రాండ్ తమ కొత్త బ్రాంచ్ కూడా ఓపెనింగ్ చేయనున్నట్టు సమాచారం. అలాగే సితార కలెక్షన్స్ అంటూ ఆమె పేరు మీదే సరికొత్త డిజైన్స్ కూడా క్రియేట్ చేసినట్టు సమాచారం.