Jaberdasth Jodi : ఆన్‌స్క్రీన్ జోడీగా నటించి.. నిజజీవితంలో కూడా ఒక్కటైన జంటలను చూస్తుంటాం. కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయిస్తూ, పంచ్‌లు వేస్తూ బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేసే ఆ జోడీ కూడా ఈ కోవకు చెందినదే. అదే రాకింగ్ రాకేశ్ – సుజాత జోడీ. వీరిద్దరూ ఇప్పుడు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఎక్కడ చూసిన వీరికి సంబంధించిన విషయాలు, వీడియోలు తెగ ట్రెండింగ్ అవుతున్నాయి.
దీంతో వీరిద్దరూ ఎప్పుడూ పెళ్లి చేసుకుంటారా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తాజాగా ఈ విషయమై ఆ జోడీ స్పందించింది. నేడు వినాయకచవితి పండుగను పురస్కరించుకుని ‘మా ఊరి దేవుడు’ అనే స్పెషల్ ప్రోగ్రామ్‌ను ఈటీవీ ప్రసారం చేసింది. ఈ కార్యక్రమానికి సీనియర్ నటులు జయప్రద, ప్రగతి, ఖుష్బూ, భగవాన్, నాగినీడు, ఇంద్రజ గెస్ట్లుగా విచ్చేది తమ సంభాషణలతో నవ్వులు పూయించారు. ఈ క్రమంలోనే రాకేష్.. తన తమ్ముడి కుమార్తెకు పేరు పెట్టాలని అక్కడికి వచ్చిన గెస్ట్‌లను కోరగా.. అందరూ కలిసి నక్షత్ర అనే పేరు పెట్టారు. ఈ సందర్భంగా రాకేష్ తల్లి.. రాకేశ్ పెళ్లి గురించి మాట్లాడుతుంది. దీంతో అందరూ పెళ్లి ఎప్పుడు అని అడగ్గా ‘శ్రీను అన్న చెబుతారు’ అని రాకేష్ అంటాడు. అప్పుడు ‘ఆమె ఎవరో కాదు మా బంధువు జోర్దార్ సుజాతతో త్వరలో పెళ్లి’ అని ప్రకటిస్తాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉంటుందని చెబుతాడు.
అంతకముందు ఓ ఇంటర్వ్యూలో రాకేశ్ తన ప్రేమ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మాది నిజమైన ప్రేమే.. ఎంతవరకు వెళ్తుందో చూడాలి. తనకు జబర్దస్త్‌లో చేయాలని ఆసక్తి ఉందని తెలిసి.. అప్పటికే వేరే కామెడీ షోలో చేస్తున్న తనను ఇక్కడికి తీసుకొచ్చాను. తను జబర్దస్త్‌లోకి వచ్చేటప్పటికే బాగా ఫేమస్. ఇక్కడ కలిసి పనిచేస్తున్న క్రమంలో మా బంధం బలపడింది. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో తను అర్థం చేసుకోలదు. అంతకుమించిన అదృష్టం మరోటి లేదు. మనకు స్వచ్ఛమైన ప్రేమ దొరికినప్పుడు తీసుకోకపోతే మళ్లీ రాదని నా అభిప్రాయం.” అని అన్నాడు.