Jahnvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ధడక్ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది జాన్వీ. తనదైన శైలిలో నటిస్తూ బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది ఈ ముద్దుగుమ్మ . బాలీవుడ్‌లో జాన్వీ చేసిన కొన్ని సినిమాలే. అయితే.. బీటౌన్‌లో ఈ సినిమాలు కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ ఎప్పుడూ సోషల్ మీడియాలో ఉండే జాన్వీ తన హాట్ ఫోటో షూట్ లతో అభిమానులకు దగ్గరగా ఉంటుంది.
ఇప్పుడిప్పుడే కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నా ఈ అమ్మడు ప్రస్తుతం సౌత్ పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. జాన్వీ కపూర్‌ను సైతం తెలుగులో తెరంగేట్రం చేయించాలని ఇప్పటికే చాలా మంది దర్శకులు కథలు వినపించారు. కానీ ఇప్పటి వరకు ఎవరి కథలకు జాన్వీ కనెక్ట్ కాకపోవడతో ఆమె తెలుగులో ఆరంగేట్రం చేయడంలేదని తెలుస్తుంది. సౌత్ సినిమాలు చేయడానికి జాన్వీ ఆసక్తిని చూపిస్తోందని ఇటీవల బోనీ కపూర్ వెల్లడించారు. తాజాగా ఇదే విషయాన్ని జాన్వీ కూడా కన్ఫర్మ్ చేస్తూ… సౌత్ సినిమాలను సైతం ఎంతో ఇష్టంగా చూస్తానని తెలిపింది.
ఈ మధ్య రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను చూశానని వివరిస్తూ.. అందులో రామ్‌గా రామ్ చరణ్, భీమ్ గా ఎన్టీఆర్‌లు నటన ఎంతో బాగుందని తెలిపింది. తెలుగు చిత్ర పరిశ్రమలో రామ్‌చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ ఇలా అందరి యాక్టింగ్ నచ్చుతుందని, అయితే.. ఎన్టీఆర్‌తో నటించే అవకాశం వస్తే మాత్రం వదులుకోనని వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ. చూడాలి మరీ ఎన్టీఆర్ సరసన నటించి అవకాశం ఏ సినిమాలో జాన్వీని వరిస్తుందోనని అనుకుంటున్నారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో జాన్వీ హీరోయిన్ గా ఎంపికయినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.