Entertainment బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ భార్య జయబచ్చన్ మరొకసారి తన పందాలు కొనసాగించారు ఎప్పుడు మీడియాపై కసగుసలాడుతూ కనిపించే జయ బచ్చన్ దీపావళి సందర్భంగా మరొకసారి తన అసహనాన్ని వ్యక్తం చేశారు.. బచ్చన్ ఫ్యామిలీని ఫోటోలు తీస్తున్న ఫోటోగ్రాఫర్స్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు..
సోమవారం జరిగిన దీపావళి సందర్భంగా ముంబైలో తమ నివాసంలో అమితాబచ్చన్ జయ బచ్చన్ దంపతులు లక్ష్మీ పూజ కార్యక్రమాలు నిర్వహించారు.. అయితే ఈ సందర్భంగా కొందరు ఫోటోగ్రాఫర్లు మీరు ఫోటోలు తీయటానికి ప్రయత్నించారు అయితే జయా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతేకాకుండా ఆ మీడియా ప్రతినిధులను ఫోటోగ్రాఫర్లను అంటూ పిలుస్తూ పెద్ద పెద్దగా కేకలు పెడుతూ తరిమికొట్టటానికి ప్రయత్నించారు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
ఈ వీడియో క్లిప్ ను కొందరు ఫోటోగ్రాఫర్లు షేర్ చేశారు ఇందులో ప్రింటెడ్ వైట్ కుర్తా వేసుకొని ఉన్న జయ తన ఇంటి గేటు దగ్గర ఉన్న ఫోటోగ్రాఫర్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు… “అసలు మీరు ఇలా ఎలా చేస్తారు.. వెంటనే మీ కెమెరాల స్విచ్ ఆఫ్ చేయండి…” అని చెప్పారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా కొందరు ఫోటోగ్రాఫర్లు ఆమెపై కామెంట్లు చేశారు ఆమెను దయచేసి ఒంటరిగా వదిలేయండి ఆమెను ఫోటోలు తీయకండి అంటూ కొందరు కామెంట్ చేయగా మరికొందరు నిజమే కదా ఎంత సెలెబ్రేటట్లయితే మాత్రం వాళ్ల ప్రైవసీ వాళ్లకు ఉండదు అంటూ చెప్పుకొచ్చారు..