Tarak : జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఇటీవల దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించి… పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్నాడు. ఈ మూవీలో కొమురం భీమ్ పాత్రలో తారక్ నటనకు ప్రపంచం ఫిదా అయ్యింది. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్‌లో జపాన్‌లో సందడి చేశారు ఎన్టీఆర్. అక్కడ అభిమానులు చూపించిన ప్రేమకు తారక్ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రేజ్ తో సినిమాలు, యాడ్ లతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్.
కాగా ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. వసుంధర ఆర్ట్స్, ఎన్టీఅర్ ఆర్ట్స్ కలసి నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందించనున్నాడు. ఇక ప్రస్తుతం తారక్ తన తదుపరి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు. ప్రముఖ అడ్వర్టైజింగ్ సెలబ్రెటీ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ తన సోషల్ మీడియాలో ఖాతాలో జూనియర్ ఎన్టీఆర్ క్లాసీ లుక్ షేర్ చేశారు.
అయితే అందులో తారక్ మరింత స్టైలీష్ గా కనిపిస్తున్నారు. ఈ న్యూలుక్ నెట్టింట షేక్ చేస్తుంది. ఇక ఎన్టీఆర్, కొరటాల శివ మూవీనే కాకుండా… డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రీలుక్ అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం ఈ లుక్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.
Man of the Masses… looking dapper with the glasses!! 💥💥#PostPackUpShot@tarak9999 pic.twitter.com/3jPDpBLKHg
— Avinash Gowariker (@avigowariker) November 22, 2022