Entertainment ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన 60 ఏళ్ల నట జీవితంలో వైవిధ్యమైన పాత్రలను పోషించారు. అలాగే సత్యనారాయణ పేరు వినగానే ఆయన పోషించిన పాత్రల్లో యమధర్మరాజు పాత్ర కూడా ఒకటి ముఖ్యంగా ఈన యమగోల యముడికి మొగుడు యమగోల మళ్ళీ మొదలైంది దరువు చిత్రాల్లో ఈ పాత్రను పోషించారు అయితే ఈయన నటించిన చివరి చిత్రం మహేష్ బాబు హీరోగా వచ్చిన మహర్షి అని అంటారు కానీ ఇది కాదు ఈయన చివరి చిత్రం ఏంటి అంటే ధీర్ఘాయుష్మాన్‌భవ..
ఈ సినిమాని కైకాల సత్యనారాయణ చివరి చిత్రం ఇందులో ఈయన యమధర్మరాజు పాత్రను పోషించారు.. ఈ సినిమాను జనవరిలో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ అంతలోనే కైకాల సత్యనారాయణ కాలం చేశారు. ఈ విషయం దీర్ఘాయుష్మాన్‌భవ టీమ్‌ను ఎంతో బాధకు గురి చేసింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు స్పందించారు. అలాగే ‘‘కైకాల సత్యనారాయణగారు నవరస భరితమైన నటనతో తెలుగు ప్రేక్షకులని అలరించిన గొప్ప నటుడు. చారిత్రాత్మక, సాంఘిక చలన చిత్రాల్లో తనదైన శైలితో మెప్పించిన నవరస నటనా సార్వభౌమడు కైకాల సత్యనారాయణగారు. మేము నిర్మిస్తున్న ఆయన చివరి చిత్రం ‘దీర్ఘాయుష్మాన్‌భవ’.. సినిమా ఆడియో లాంచ్ ను ఆయన చేతుల మీదుగా చేసి చిత్రాన్ని విడుదల చేయాలి అనుకున్నాము ఇంతలోనే ఇలా జరగడం నిజంగా చాలా బాధాకరం అంటూ చిత్ర బృందం తెలిపింది.. అలాగే ఇప్పటివరకు తన కెరీర్లో దాదాపు 750 కి పైగా చిత్రాల్లో నటించారు కైకాల సత్యనారాయణ..