Entertainment కళ్యాణ్ రామ్ నటించిన అమీగోస్ చిత్రం తాజాగా సక్సెస్ ను సాధించింది. ఫిబ్రవరి 10 న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సంపాదించుకుంది. అయితే ఈ సక్సెస్ పై మాట్లాడిన కళ్యాణ్ రామ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు..
అమిగోస్ చిత్రం సక్సెస్ కావడంతో మాట్లాడిన కళ్యాణ్ రామ్.. ‘‘ మొదటిసారి 18 సంవత్సరాల తర్వాత బింబిసార తర్వాత అమిగోస్ అనే సక్సెస్ వచ్చింది.. సినిమాను ఇంత విజయవంతం చేసినందుకు నందమూరి ఫ్యాన్స్‌కి, ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. నేను ఇండస్ట్రీలోకి వచ్చి 18 ఏళ్లు అవుతుంది. ప్రతీసారి ఓ హిట్ ఇచ్చిన తర్వాత నెక్ట్స్ వచ్చే సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవటం జరుగుతూ వచ్చింది. మనసులో విపరీతంగా ఆలోచన ఉండేదిది. బాధ పడేవాడిని. తప్పు ఎక్కడ జరిగిందని ఆలోచించే వాడిని. సక్సెస్ తర్వాత సక్సెస్ వస్తే విపరీతమైన ఎనర్జీ వస్తుంది. అది నెక్ట్స్ సినిమాకు డ్రైవింగ్ ఫోర్స్‌లా ఉంటుంది. అలాంటిది మొట్ట మొదటిసారి 18 సంవత్సరాల తర్వాత సక్సెస్ వచ్చింది. ప్రేక్షకులందరికీ థాంక్స్. పెద్ద బ్యానర్ పేరున్న డైరెక్టర్‌తో కథను చెప్పించి సినిమా చేసెయొచ్చు. కానీ డైరెక్టర్ రాజేంద్రను, అతని కథను నమ్మినందుకు నవీన్‌గారికి, రవిగారికి థాంక్స్ ముందుగా మా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఓ కొత్త దర్శకుడు కొత్త పాయింట్‌తో వస్తే దాన్ని కూర్చో పెట్టుకుని వర్క్ చేయించుకున్నారు. కథను నమ్మారు. సినిమా రేసీగా ఉందని అంటుంటే హ్యాపీగా ఉంది. ఆషికా రంగనాథ్ ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టేశారు. సౌందర్ రాజన్‌గారు అద్భుతమైన విజువల్స్ అందించారు. అలాగే మా ఇతర టెక్నీషియన్స్‌కి థాంక్స్.. ” అంటూ చెప్పుకొచ్చారు కళ్యాణ్ రామ్..