Viral Video సోషల్ మీడియా ఓపెన్ చేస్తేనే చాలు ప్రతీ రోజు ఎన్నో వింతలు.. విశేషాలు కనిపిస్తూనే ఉంటాయి.. ముఖ్యంగా జంతువులు చేసే పనులు.. అవి చేసే వింత చేష్టలు చూస్తుంటే నవ్వు ఆగదు. ఇలాంటి వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటాయి. ఈ వైరల్ వీడియోలకు ప్రతి ఒక్కరినీ అట్రాక్ట్ అవుతున్నారు. ఎవరైనా సరే ఎంత టెన్షన్లో ఉన్నా సరే.. ఈ వీడియోలను చూసి తప్పకుండా రిలాక్స్ అవుతున్నారు.. అయితే తాజాగా ఓ పిల్లి తయారు చేసిన కుండలు చూసిన నెటిజన్లకు తెగ నవ్వు వస్తుంది.
సాధారణంగా పిల్లలకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పిల్లులు వ్యాయామాలు చేసే వీడియోలు, పనులు చేసే వీడియోలకి యూ ట్యూబ్ లో కొదవే ఉండదు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో పిల్లి ఏకంగా కుండలు చేస్తూ కనిపించింది. ఈ వీడియోలో పిల్లి కుండలు చేస్తున్న ఒక వ్యక్తికి సాయం చేస్తూ కనిపిస్తుంది.. పిల్లి తన ముందు కాలుతో ఆ కుండను పట్టుకోవడం భలే అనిపిస్తుంది. అతడు మట్టిని తీసుకుని చక్రం మీద పెట్టి కుండ ఆకారం ఇస్తున్నపుడు ఆ పిల్లి తన వంతు సాయంగా ఆ కుండను టచ్ చేస్తోంది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
https://twitter.com/buitengebieden/status/1572446272119873537?s=20&t=hZV8p8EsV59UEFm-NfFTMQ
ఈ క్యూట్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నవ్వు ఆపుకోలేకపోతున్నారు అంతేకాకుండా చూసిన వారంతా వావ్ అంటున్నారు. ఈ వైరల్ వీడియోకి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. అంతేకాకుండా నైస్ క్యాట్ క్యూట్ క్యాట్ కంటిన్యూ అంటూ కామెంట్స్ పెడుతున్నారు..