Entertainment టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా మంచి హిట్ అయి ప్రేక్షకుల మననలు పొందింది అయితే ప్రస్తుతం వాల్తేరు వీరయ్య గా అభిమానులను ఆదరించడానికి రెడీ అయ్యారు చిరు డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో మాస్ మహారాజ రవితేజ కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు అయితే దీపావళి కానుకగా ఈ సినిమా టైటిల్ టీజర్ను విడుదల చేసింది చిత్ర బృందం..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న మెగా 154 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్ అలాగే టీజర్లు ఫ్యాన్స్ ను ఉర్రుతలూగించాయి. అయితే మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూసిన ఈ మూవీ టైటిల్ టీజర్ దీపావళి పండుగను పురస్కరించుకొని రిలీజ్ చేసింది చిత్రం బృందం. ఇది అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. చిరు డైలాగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఇది మెగా అభిమానుల్లో అంచనాలు పెంచేశాయి. ఈ సినిమాలో చిరు మాస్ లుక్‌లో కనిపించనున్నారు.
మాస్ ఎంటర్ టైనర్‌గా రానున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయట. చిత్ర బృందం ఈ సన్నివేశాలు తెరకెక్కించడం పై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. మెగా అభిమానులంతా ఎప్పుడో అని ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా తీసుకురావాలని భావిస్తున్నారు. దీనిలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్ నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, వై.రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Happy Diwali 🪔 🪔 to All!! https://t.co/1IsKCvMnU3
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 24, 2022