Entertainment టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి తాజాగా సింగర్స్ స్మిత హోస్ట్గా వ్యవహరిస్తున్న నిజం విత్ స్మిత టాక్ షోకు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్న మెగాస్టార్ తన జీవితంలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని సైతం చెప్పుకొచ్చారు..
టాలీవుడ్ లో మంచి సింగర్ గా పేరు తెచ్చుకున్న గాయని స్మిత తాజాగా ఒక టాక్ షోను ప్రారంభించబోతున్నారు. నిజం విత్ స్మిత టైటిల్ తో ఈ షో రాబోతున్నట్టు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా మొదటి ఎపిసోడ్ ను టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవితో ఆరంభం చేయనున్నారు. అయితే ఇప్పటికే ఈ షో ను షూట్ చేయగా.. ఇందులో చిరంజీవి తన జీవితంలో ఎదురైన ఎన్నో విషయాలను చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది..
ఈ షోకు సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదల అయింది. ఇందులో చిరంజీవికి స్వాగతం పలుకుతూ ప్రోమో స్టార్ అవుతుంది. చిరంజీవి ఫస్ట్ క్రష్, తదితర సరదా ప్రశ్నలకు చిరంజీవి ఆకట్టుకునేలా సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే ‘మీరు ఎదిగే క్రమంలో ఎదురైన అవమానాలు? అనుమానాలు? లాంటివి’ అంటూ స్మిత చిరును ప్రశ్నించింది. ఇందుకు చిరంజీవి “ఇండస్ట్రీలో ఎదుగుతున్న క్రమంలో.. ఓ సందర్భంలో జగిత్యాలకు వెళ్లాను. అక్కడ అభిమానులు ఘన స్వాగతం పలుకుతూ పైనుంచి పూల వర్షం కురిపించారు. కానీ కొంచెం ముందుకు వెళ్లగానే కొందరు కోడి గుడ్లతో కొట్టారు..” అంటూ బదులిచ్చారు. విన్న అతని అభిమానులు అందరూ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు చిరంజీవి పైన ఇలా చేయాల్సిన అవసరం ఏంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అయితే దీనికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ వస్తేనే చిరంజీవి ఏం చెప్పారనేది స్పష్టత రానుంది. ఫిబ్రవరి 10న చిరంజీవి ఎపిసోడ్ ప్రసారం కానుంది.