Viral News : సోషల్ మీడియా మహత్యం ఏమోగానీ ఏ వీడియో పోస్ట్ చేసిన పోస్ట్ చేసిన కొద్దిగా వ్యవధిలోనే వైరల్ గా మారిపోతుంది. అది చిన్నపిల్లల దగ్గర నుండి పక్షులు జంతువుల వరకు వైరల్ అవుతూనే ఉంటాయి. కొన్నిసార్లు సోషల్ మీడియా మనిషిపై ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జాబ్ పరంగా లేదా వ్యక్తిగతంగా కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడేవారు నవ్వుకు దూరమైపోతారు అటువంటి వారికి కాస్త రిలీఫ్ ఇస్తుంది సోషల్ మీడియా. అయితే ఈ వీడియో చూసిన వారు ఎవరైనా చూసి నవ్వుకోవాల్సిందే అంత కామెడీ చేస్తుంది ఈ కోతి అయితే మరి చూసేయండి.
తాజాగా ఓ కోతికి చేస్తున్న రచ్చ నెట్టింట హల్చల్ చేస్తుంది. అయితే ఈ కోతికి సంబంధించిన వీడియోలో ఏముందంటే చెట్టుపై రెండు కోతులు కూర్చుని ఉంటాయి వాటికి ఎక్కడ దొరికిందో మంచి ఖరీదైన మద్యం బాటిల్ దొరికిందండోయ్. అసలే మద్యం బాటిల్ మనిషికి దొరికితేనే పిచ్చి తొందర పడితే తాగేస్తారు. ఇంకా ఏమీ తెలియని కోతికి అదొక అమృతమే అని చెప్పుకోవచ్చు. ఆ దొరికిన బాటిల్ ని దించకుండా గుటకుట తాగేసాయి. తాగేసిన తర్వాత రోడ్డుపై పార్కు చేసిన వాహనాలు పై పడ్డాయి.
అసలే మద్యం మనుషులు తాగితేనే ఏం చేస్తున్నారు వారే తెలియకుండా ప్రవర్తిస్తారు ఇంకా కోతులు తాగితే ప్రత్యేకంగా మనం చెప్పనక్కర్లేదు మీకే అర్థమవుతుంది
అక్కడున్న కారులపై పడి విధ్వంసం చేశాయి కారు అద్దాలు నంబర్ పీకిపారేసి నానా రచ్చ చేశాయి. రచ్చ రచ్చ చేస్తున్న ఈ కోతులను వీడియోని ఎవరో ఒక వ్యక్తి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది.