Entertainment సంగీత దర్శకుడు కీరవాణి ఇంట తీవ్ర విషాదం నెలకొంది గత కొన్నాళ్లుగా అనారోగ్య కారణంతో బాధపడుతున్న అతని తల్లి ఈరోజు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు దీంతో కీరవాణి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది..
సంగీత దర్శకుడు కీరవాణి తల్లి వయోభారం కారణంగా పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఆరోగ్యం క్షీణించటంతో కిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు అయితే వైద్యానికి ఆమె శరీరం సహకరించలేదు ఈ నేపథ్యంలో ఈరోజు చికిత్స పొందుతూ ఆమె మరణించారు దీంతో విషాదంలో మునిగిపోయాయి కీరవాణి రాజమౌళి కుటుంబాలు. తల్లి మరణంతో కీరవాణి తీవ్ర వేదనకు గురయ్యారు. ఆసుపత్రి నుండి మృతదేహాన్ని కీరవాణి ఇంటికి తరలించనున్నారు. కీరవాణి తల్లి మృతి వార్త తెలుసుకున్న చిత్ర ప్రముఖులు, సన్నిహితులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
దర్శకుడు రాజమౌళి కీరవాణికి సోదరుడు అవుతారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, కీరవాణి తండ్రి శివ శక్తి దత్త అన్నదమ్ములు.. అలాగే శివశక్తి దత్త కూడా సినీ రంగంలో పనిచేసిన వారే.. తండ్రి సినీ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. టాలీవుడ్ లో సంగీత దర్శకుడిగా కీరవాణి సుదీర్ఘ కెరీర్ కలిగి ఉన్నారు. అలాగే రాజమౌళి అన్ని సినిమాలకు కీరవాణి సంగీతం అందిస్తారు అతను మొదటి చిత్రం నుండి ఇప్పటివరకు ప్రతి చిత్రానికి కీరవాణి అందించిన రాగాలు సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లాయి..