ఆ సినిమాపై ఆశలు పెట్టుకున్న నాగ చైతన్య.. తీరా చూస్తే పెద్ద షాక్..
అక్కినేని కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కినేని నాగేశ్వరరావు తర్వాత అతడి కొడుకు అయినా అక్కినేని నాగార్జున తండ్రికి తగ్గ తనయుడుగా పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం నాగార్జున ఆ గౌరవం దక్కుతుందో లేదో అనేది ఒక ప్రశ్నగా మారిందనే చెప్పుకోవాలి. నాగార్జున పేరును తన కొడుకులు నిలబెడతారో లేదా అనేది అభిమానులలో ఒక ప్రశ్నగా మెదులుతుంది.ఈ ఏడాది నాగచైతన్య రెండు చిత్రాలను విడుదల చేసిన విజయం అందుకోలేక పోయారు. ఇంకా అఖిల్ సంగతికి వస్తే సినీ పరిశ్రమలో గత మూడు ఏళ్ల నుండి సూపర్ హిట్ లేదని చెప్పుకోవాలి. గత ఏడాదిలో విడుదలైన బ్యాచిలర్ సినిమాతో కాస్త సక్సెస్ రేటును రుచి చూశారు అఖిల్.
ఇదిలా ఉంటే ప్రస్తుతం చైతన్య సినీ కెరియర్ ఎటువైపు వెళ్తుందో అర్థం కానట్లుగానే ఉంది. చైతన్య అందరి హీరోల సోషల్ మీడియాలో యాక్టివ్ పర్సన్ కూడా కాదు. తన స్టైల్లో సినిమాలు తీసుకుంటూ తన పని తాను చేసుకునే నైజంగానే చెప్పుకోవాలి. సమంతతో విడాకుల తర్వాత సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత జీవితంపై ఎన్నో విమర్శలు వచ్చిన వాటిని పట్టించుకోకుండా ఎవరి పని వాళ్ళు చూసుకున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య సినిమాలు ప్రేక్షకులు ఆశించినంత విజయం అందుకోలేకపోతున్నా.
తాజాగా విడుదలైన లాల్‌సింగ్‌చడ్డా చైతు కి విజయం చేకూర్చలేకపోయింది.బాలీవుడ్ మిస్టర్పర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా లాల్‌సింగ్‌చడ్డా.ఈ సినిమాలో చడ్డా చడ్డీ బడ్డీ బాలరాజు పాత్రలో నటించారు నాగ చైతన్య. ఈ చిత్రంలో చైతు యాక్టింగ్‌పై ప్రశంసలు వచ్చినప్పటికీ బాలీవుడ్ మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్‌కావడంతో చైతన్యకు పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి. ఏ బ్యాగ్రౌండ్ లేని హీరోలు సైతం పాన్ ఇండియా తరహా సినిమాలు తీసి సక్సెస్ అవుతుంటే బ్యాక్ గ్రౌండ్ ఉన్న చైతన్య సక్సెస్ అందుకోవడం విచిత్రం అని చెప్పుకోవాలి. ప్రస్తుతం చైతు ఖాతాలో కొత్త సినిమాలు లేవని చెప్పుకోవాలి చూడాలని మరి చైతు కెరియర్ ఎటువైపు కొనసాగుతుందో.