Nani : నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన 30వ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కొత్త డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో ఈ ల్యాండ్ మార్క్ మూవీ తెరకెక్కుతుంది. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. అందాల భామ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్ శృతిహాసన్ (Shruti Haasan) ఒక ముఖ్య పాత్ర చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.
తాజాగా నాని ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ని ఇచ్చాడు. ఆకాశంలో పారాగ్లైడింగ్ (Paragliding) చేస్తూ ఈ అప్డేట్ ని ఇచ్చాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్ ని జులై 13న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఇక నాని షేర్ చేసిన పారాగ్లైడింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఈ సినిమా పూర్తి ఎమోషనల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. గతంలో నాని ‘జెర్సీ’ సినిమాలో తండ్రిగా కనిపించి అందర్నీ ఎమోషనల్ చేశాడు. ఇప్పుడు మరోసారి అదే తరహా పాత్ర చేస్తుండడంతో ఈ మూవీ పై మంచి అంచనాలే నెలకొన్నాయి.
వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై ఈ చిత్రాన్ని చెరుకూరి మోహన్, డాక్టర్ విజయేందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మలయాళ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. క్రిస్మస్ కానుకగా ఈ ఏడాది డిసెంబర్ 21న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఇక ఇటీవలే దసరా (Dasara) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 115 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని నానిని 100 కోట్ల క్లబ్ లోకి తీసుకు వచ్చింది. మరి Nani30 తో ఎటువంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తాడో చూడాలి.