Prabhas-Salaar Movie : ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) నుంచి రాబోతున్న సినిమా ‘సలార్’. శ్రుతి హాసన్(Shruti Haasan) హీరోయిన్ గా, మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran), జగపతి బాబు(Jagapathi Babu) విలన్స్ గా, శ్రియారెడ్డి, మరికొంతమంది స్టార్ ఆర్టిస్టులు ముఖ్య పాత్రల్లో భారీ మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతుంది సలార్. ఇటీవలే సలార్ టీజర్ రిలీజ్ చేసి అభిమానులకు ఫుల్ జోష్ ఇచ్చారు. ఇందులో ప్రభాస్ గురించి ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చారు. సలార్ సినిమా కూడా రెండు పార్టులుగా ఉండబోతున్నట్టు ప్రకటించి సలార్ పార్ట్ 1′ ceasefire ‘అని టైటిల్ ఇచ్చారు.
ప్రస్తుతం సలార్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. సెప్టెంబర్ 28న సలార్ పార్ట్ 1 రిలీజ్ చేస్తారని ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు సలార్ నుంచి మరో ఆసక్తికర అప్డేట్ వచ్చింది. సలార్ సినిమాని హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయనున్నారు. సాధారణంగానే మన సినిమాలు అమెరికాలో, వేరే దేశాల్లో రిలీజ్ అవుతాయి. అయితే అవి తెలుగు డైలాగ్స్ తోనే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో రిలీజ్ అవుతాయి.
సలార్ సినిమా మాత్రం డైరెక్ట్ ఇంగ్లీష్ లో హాలీవుడ్ సినిమాగా ఇంగ్లీష్ డబ్బింగ్ తో రిలీజ్ కానుంది. అయితే సలార్ సినిమా రిలీజయిన 15 రోజుల తర్వాత హాలీవుడ్ లో రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. సలార్ సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతుండగా హాలీవుడ్ లో అక్టోబర్ 13న రిలీజ్ చేస్తారని సమాచారం. దీంతో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.