కారణజన్ముడు నందమూరి తారకరామారావు 101వ జయంతిని పురస్కరించుకుని “ఇండియన్ లిటరేచర్ ట్రాన్సలేషన్ ఫౌండేషన్” ఎన్ఠీఆర్ జాతీయ పురస్కారాలు ప్రదానం చేసింది. హైదరాబాద్, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అత్యంత ఘనంగా నిర్వహించిన వేడుకలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ రైటర్ ధీరజ అప్పాజీ… ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నారు!!
కళారత్న బిక్కి కృష్ణ సారధ్యంలో కన్నుల పండువగా జరిగిన ఈ వేడుకలో ఎన్ఠీఆర్ తనయుడు – ప్రముఖ ఛాయాగ్రాహకుడు – నిర్మాత నందమూరి మోహన కృష్ణ, ఎన్టీఆర్ మనవరాలు నందమూరి మోహన రూప, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్.ఎల్.సి. టి.డి.జనార్దన్, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ కులపతి, ప్రముఖ భాషావేత్త పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్, తెలుగువన్ డాట్ కమ్ అధినేత, నిర్మాత కంఠంనేని రవిశంకర్, ఆదాయపన్ను శాఖ ఛీఫ్ కమీషనర్ (రిటైర్డ్) యం. నరసింహప్ప, ప్రముఖ కవయిత్రి రాజావాసిరెడ్డి మల్లీశ్వరి, దళిత జాగృతి పితామహుడు కుసుమ ధర్మన్న ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ రాధా కుసుమ, తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్, శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, వాడుక భాష ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు గిడుగు కాంతికృష్ణ తదితర లబ్ధ ప్రతిష్టులు పాలుపంచుకున్నారు!!
రెండు దశాబ్దాలుగా సినీ పాత్రికేయుడిగా నిర్విరామంగా పని చేస్తూ… గత మూడేళ్ళుగా “ట్రెండ్ సెట్టర్”గా నిలిచిన “స్వాతిముత్యం” డిజిటల్ పేపర్ ను నిరవధికంగా నిర్వహిస్తున్న ధీరజ అప్పాజీ… ఇంతకుముందు “గిడుగు రామ్మూర్తి జాతీయ పురస్కారం, దాసరి ప్రతిభా పురస్కారం, కోడి రామకృష్ణ స్మారక పురస్కారం”తోపాటు… ‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’చే ఉత్తమ సినీ పాత్రికేయ పురస్కారం” అందుకున్నారు. దాసరి 77వ జయంతి సందర్భంగా మార్చి 5న హైదరాబాద్ శిల్ప కళావేదికలో అత్యంత ఘనంగా నిర్వహించిన “దర్శకరత్న డి.ఎన్.ఆర్. ఫిల్మ్ అవార్డ్స్” కమిటీలో… ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభులతోపాటు ధీరజ అప్పాజీ కూడా “జ్యురీ మెంబర్”గా వ్యవహరించారు!!
ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా.. సాక్షాత్తు ఎన్టీఆర్ తనయుడు నందమూరి మోహన్ కృష్ణ, మోహన రూప చేతుల మీదుగా, వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల సమక్షంలో “ఎన్ఠీఆర్ జాతీయ పురస్కారం” అందుకోవడం చాలా గర్వంగా ఉందన్న అప్పాజీ…. ఈ అవార్డు.
పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్