Movie జూనియర్ ఎన్టీఆర్ పై ఓ బామ్మ బూతులతో రెచ్చిపోయింది. వైసిపి ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై తారక్ స్పందించిన తీరును ఆమె తప్పుబట్టింది. అంతేకాకుండా మీ తాతను అవమానించినప్పుడు నువ్వు ఉండి ఎందుకు అంటూ విమర్శలు గుప్పించింది..
ఏపీలో అమరావతి రాజధాని సాధన కోసం రైతులు మహా పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎందరో రైతులు పాల్గొన్నారు తెలుగుదేశం కోసమే పాటుపడుతున్న వాళ్లంతా ఈ ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు.. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ పాదయాత్రను విజయవంతం చేయటానికి ఎంతగానో కృషి చేస్తున్నారు.. ఈ పాదయాత్రలో పాల్గొన్న ఓ బామ్మను రిపోర్టర్ పలకరించగా.. జూనియర్ ఎన్టీఆర్ పై తిట్ల దండకం అందుకుని ఫైర్ అయ్యింది.
ఎన్టీఆర్ మనవడినని చెప్పుకుంటున్నాడు. ఎందుకు ఎన్టీఆర్ మనవడు. ఏమీ వద్దు మహానుభావా! నువ్వు ఎన్టీఆర్ మనవడివి అయితే రా ముందుకు రా..! నీ తాతను అవమానించినప్పుడు ఇంకా నువ్వెందుకురా.. నువ్వు ఉంటే ఏమీ చస్తే ఏమి.. మా తెలుగుదేశాన్ని మేమే లాక్కొచ్చుకుంటాం..అంటూ ఆ ముసలావిడ ఎన్టీఆర్ ను దూషించింది.. ఈ వీడియో చూసిన వాళ్లంతా నిజమే కదా ఎన్టీఆర్ ఇంత మంచి స్థితిలో ఉండి కూడా ఎందుకు రాజకీయాలు వైపు రాలేకపోతున్నారు అంత పేరు ఉన్న ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చినప్పుడు కేవలం ఒక ట్వీట్ చేసి దులిపేసుకున్నారు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు..