Pathaan Movie : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గురించి తెలియని వారు అంటూ ఎవరూ ఉండరు. భారతదేశం లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు నివసించే ప్రదేశాల్లో కూడా ఆయన చాలా ప్రసిద్ధుడు అని చెప్పాలి. అయితే షారుక్ ఖాన్ సినిమా వచ్చి దాదాపు మూడేళ్ళు దాటిపోయింది. ఆయన సొంత నిర్మాణంలో వచ్చిన జీరో భారీ డిజాస్టర్ అవడంతో మళ్ళీ షారుక్ సినిమా చేయడానికి చాలానే గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఆయన పఠాన్ అనే సినిమా చేస్తున్నాడు. కాగా మరోవైపు షారుఖ్ ఖాన్ పుట్టిన రోజు సందడి మొదలైంది. నవంబర్ 2న బాద్ షా బర్త్ డే కావడంతో బీటౌన్‌లో సెలబ్రెషన్స్ షూరు అయ్యాయి.
ఈ క్రమం లోనే తాజాగా షారుఖ్ నెక్ట్స్ మూవీ పఠాన్ టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఎలాంటి అప్డేట్ లేకుండానే… ఆకస్మాత్తుగా టీజర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ టీజర్‌ను షారుఖ్ తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేయగా… నెట్టింట వైరల్ గా మారింది. ఇక తాజాగా విడుదలైన టీజర్ చూస్తే… ఈసారి అభిమానులకు ఫుల్ యాక్షన్ మీల్స్ అందించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో షారుఖ్ ఒక గూఢచారి పాత్రలో కనిపించనున్నారు.
ఈ టీజర్ లో… ఓ ప్రమాదకరమైన మిషన్ లో పాల్గోన్న షారుఖ్ చనిపోయాడని అంతా అనుకుంటారు. ఆ తర్వాత సరికొత్త లుక్‌లో తిరిగి జాన్ అబ్రహంతో ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 25 హిందీ లోనే కాకుండా తమిళం, తెలుగులో విడుదల కానుంది. డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొణె, జాన్ అబ్రహం కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఫుల్ యాక్షన్ స్వింగ్‌లో షారుఖ్ రాబోతుండడంతో మూవీపై అంచనాలు భారీ గానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ టీజర్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.